iDreamPost
android-app
ios-app

పరారీలో రాజ్ తరుణ్? షాకింగ్ కామెంట్స్ చేసిన లావణ్య

  • Published Jul 11, 2024 | 4:29 PM Updated Updated Jul 11, 2024 | 4:29 PM

Lavanya Stated That Raj Tarun Absconded: రాజ్ తరుణ్ పై కేసు నమోదు అయ్యింది. ఏ1గా రాజ్ తరుణ్ పేరును చేర్చారు. అలాగే లావణ్య ఈ కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది.

Lavanya Stated That Raj Tarun Absconded: రాజ్ తరుణ్ పై కేసు నమోదు అయ్యింది. ఏ1గా రాజ్ తరుణ్ పేరును చేర్చారు. అలాగే లావణ్య ఈ కేసుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది.

  • Published Jul 11, 2024 | 4:29 PMUpdated Jul 11, 2024 | 4:29 PM
పరారీలో రాజ్ తరుణ్? షాకింగ్ కామెంట్స్ చేసిన లావణ్య

ప్రస్తుతం రాజ్ తరుణ్- లావణ్యల కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని లావణ్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆధారాలు సమర్పించడంతో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తనని వివాహం చేసుకోవడం మాత్రమే కాకుండా.. తనకు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపిస్తోంది. దానికి తగిన ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించినట్లు లావణ్య వెల్లడించింది. మరోవైపు ఈ కేసులోకి కల్యాణ్ దిలీప్ సుంకర ఎంటర్ అయ్యారు. రాజ్ తరుణ్ కు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించామని తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో బిగ్ ట్విస్ట్ వినిపిస్తోంది. రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు లావణ్య తెలిపింది.

రాజ్ తరుణ్ ఏ1 ముద్దాయిగా ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు లావణ్య మీడియాతో మాట్లాడింది. ఈ సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని తనని ఒత్తిడి చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. కేసు వాపస్ తీసుకుంటే తనకు రూ.5 లక్షలు ఇస్తామని మెసేజ్ లు పెడుతున్నట్లు చెప్పింది. అలాగే రాజ్ తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని.. అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారని లావణ్య వ్యాఖ్యలు చేసింది. “మా కుటుంబం రాజ్ తరుణ్ ని అన్ని విధాలుగా ఆదుకుంది. అతని కోసం మేము ఇప్పటి వరకు రూ.70 లక్షలు ఇచ్చాం. అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు మొత్తం నా కుటుంబమే భరించింది. అతను పెంచుకునే కుక్కల కారణంగా మేము ఆరేళ్లలో ఆరు ఇల్లు మారాం. నాకు 2016లో ప్రెగ్నెన్సీ వస్తే.. అబార్షన్ చేయించాడు. అందుకు సంబంధించి మెడికల్ బిల్స్ కూడా రాజ్ తరుణ్ చెల్లించాడు. అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు సమర్పించాను కూడా.

మాల్వి మల్హోత్రా- ఆమె సోదరుడు నన్ను చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నారు. ఎవరి బెదిరింపులకు కూడా నేను లొంగను. నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను” అంటూ లావణ్య వ్యాఖ్యానించింది. మరోవైపు లావణ్య తరఫున న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర కూడా రాజ్ తరుణ్ కు సవాలు విసిరారు. లావణ్య మీద అనవసరపు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ వాళ్లని ఒత్తిడి చేసి వీడియోలు పబ్లిష్ చేయించినట్లు తెలిసిందని చెప్పారు. అలాగే బ్రేకప్ చెప్పుకోవడానికి ఇది లివిన్ కాదని.. పెళ్లి చేసుకున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. అన్నీ ఆధారాలు పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. రాజ్ తరుణ్ పరారీలో ఉన్నాడు అంటూ లావణ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom