iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ కోసం రోడ్డు మీదకి లావణ్య! నా భర్తతో మాట్లాడాలంటూ!

  • Published Jul 31, 2024 | 6:26 PM Updated Updated Jul 31, 2024 | 6:39 PM

Lavanya Protest At Raj Tarun Tiragabadara saami Pre Release Event: రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా కాంబోలో వస్తున్న తిరగబడరా సామి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు లావణ్య కూడా వెళ్లింది. ప్రసాద్ ల్యాబ్స్ బయట ఆమె నిరసన తెలిపింది.

Lavanya Protest At Raj Tarun Tiragabadara saami Pre Release Event: రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రా కాంబోలో వస్తున్న తిరగబడరా సామి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు లావణ్య కూడా వెళ్లింది. ప్రసాద్ ల్యాబ్స్ బయట ఆమె నిరసన తెలిపింది.

  • Published Jul 31, 2024 | 6:26 PMUpdated Jul 31, 2024 | 6:39 PM
రాజ్ తరుణ్ కోసం రోడ్డు మీదకి లావణ్య! నా భర్తతో మాట్లాడాలంటూ!

రాజ్ తరుణ్- లావణ్యల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడని.. తనకు అబార్షన్ కూడా చేయించాడు అంటూ లావణ్య ఆరోపణలు చేసింది. అలాగే అతనిపై, తిరగబడరా సామి మూవీ హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కూడా ఫిర్యాదులు చేసింది. ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తులో ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్- మాల్వి మల్హోత్రాలు చేసిన తిరగబడరాసామి మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే అక్కడకు అనుకోని అతిథిలా లావణ్య కూడా వెళ్లింది. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ కార్యక్రమం జరగ్గా.. లావణ్య అక్కడ నిరసనకు దిగింది.

తిరగబడరాసామి మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, మూవీ టీమ్ రిలీజ్ ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 2వ తేదీనా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మూవీ టీమ్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో సినిమాకి సంబంధించిన ప్రశ్నలతో పాటుగా.. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే రాజ్ తరుణ్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ వ్యాఖ్యానించాడు. తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని.. న్యాయపరంగా తాను పోరాడతాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించుకుని వెళ్తున్న సమయంలో అక్కడకు లావణ్య కూడా వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్ బయట లావణ్య బైటాయించి నిరసనకు దిగింది. తన భర్త రాజ్ తరుణ్ తనకి కావాలి అంటూ డిమాండ్ చేసింది. రాజ్ తరుణ్ తో తనని కలిపించాలి అంటూ లావణ్య కోరింది. తనకు న్యాయం చేయాలి అని.. రాజ్ తరుణ్ నిలదీయాలి అంటూ లావణ్య డిమాండ్ చేసింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ప్రసాద్ ల్యాబ్స్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు వచ్చి లావణ్యకు సర్దిచెప్పారు. ఆమె అలా గొడవకు దిగడం కరెక్ట్ కాదు అంటూ వారించారు. ఆమెను తన సొంతం వాహనంలో ప్రసాద్ ల్యాబ్స్ దగ్గరి నుంచి పంపించేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss