iDreamPost
android-app
ios-app

హడావిడిగా పుష్ప 2 టీం… అంతా టెన్షన్ టెన్షన్..!

  • Published Nov 06, 2024 | 4:32 PM Updated Updated Nov 06, 2024 | 4:32 PM

Pushpa 2 Updates : ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి బజ్ అంతా బాగానే ఉంది. బయట ఫ్యాన్స్ హడావిడి అంతకుమించి ఉంది. కానీ పుష్ప మేకింగ్ టీం మాత్రం కంగారులో ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Pushpa 2 Updates : ఇప్పుడు పుష్ప 2 మూవీ గురించి బజ్ అంతా బాగానే ఉంది. బయట ఫ్యాన్స్ హడావిడి అంతకుమించి ఉంది. కానీ పుష్ప మేకింగ్ టీం మాత్రం కంగారులో ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 06, 2024 | 4:32 PMUpdated Nov 06, 2024 | 4:32 PM
హడావిడిగా పుష్ప 2 టీం… అంతా టెన్షన్ టెన్షన్..!

అదేంటో తెలియదు కానీ… ఎగ్జామ్ రాసే స్టూడెంట్ లాస్ట్ మినిట్ వరకు పేపర్ వదలనట్టు.. సుకుమార్ కూడా పుష్ప 2 విషయంలో లాస్ట్ మినిట్ వరకు సినిమానే అంటిపెట్టుకుని ఉండేలా ఉన్నారు. రోజు రోజు కి పుష్ప 2 మీద పెరిగే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ 5న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో వచ్చి ఉండాలి. ఈపాటికి ఈ సినిమా రికార్డ్స్ గురించి చర్చలు అయిపోయి.. పాతది అయిపోయి ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వలన ఇంతవరకు వచ్చింది అది వేరే విషయం. ఇలా సుకుమార్ చేతికి ఉండాల్సిన దానికంటే చాలానే ఎక్కువ సమయం దొరికింది. కానీ ఈ టైం కూడా సుకుమార్ కి నెక్ ఆఫ్ ది మూమెంట్ లానే ఉంది. ఓ వైపు పుష్ప సినిమా కోసం అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మరో వైపు పుష్ప టీం మాత్రం టెన్షన్ లో సతమతమౌతున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులు హడావిడిగా కొనసాగుతున్నాయి. నవంబర్ 20 కి ఫైనల్ అవుట్ పుట్ ఇచ్చేస్తానని.. డిసెంబర్ 5 కి సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తానని సుకుమార్ మాట ఇచ్చాడు. కానీ ఇప్పటికి కూడా రెండు సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. వాటిలో ఒక సాంగ్ ను మాత్రమే షూట్ చేసి.. మరో సాంగ్ ను ఆడియోలోనే ఉంచేయాలని ప్లాన్ చేస్తున్నారట. దానికి కారణం వారి దగ్గర అంత సమయం లేకపోవడమే. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అలానే ఉండిపోయాయి. దీనితో పుష్ప టీం అంతా కూడా చాలా హర్రీబర్రీ గా వర్క్ చేస్తుంది. లాస్ట్ మినిట్ వర్క్ చేస్తున్నా కానీ.. సుకుమార్ చెప్పిన టైం కు.. అనుకున్నట్లుగా సినిమాను అందిస్తాడని అంతా బలంగా నమ్ముతున్నారు.  మరో వైపు పుష్ప సినిమా ప్రమోషన్స్ ను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటివరకు వచ్చిన హైప్ అంతా కూడా కేవలం వినిపిస్తున్న బజ్ నుంచి వచ్చిందే. ఇక ఆ ట్రైలర్ , ప్రమోషన్స్ కాస్త మొదలైతే కానీ అసలు హైప్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్స్ అన్నిటికి అల్లు అర్జున్ తో పాటు.. మూవీ టీం అంతా వెళ్లాల్సి ఉంటుంది. కానీ సుకుమార్ మాత్రం అన్ని ఈవెంట్స్ లో కనిపించకపోవచ్చు. ఎందుకంటే మూవీ పెండింగ్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయ్ కదా మరి. ఎలా అయినా సరే నవంబర్ 20 కి సినిమా ఫైనల్ అవుట్ పుట్ ను ఇచ్చేయాలని.. కష్టపడుతున్నారట సుకుమార్ అండ్ కో. టైం తీసుకుంటే తీసుకున్నాడు కానీ… రిలీజ్ తర్వాత ఇప్పటివరకు క్రియేట్ అయిన బజ్ నిలబడితే చాలని భావిస్తున్నారు అభిమానులు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ