iDreamPost
android-app
ios-app

అనుదీప్‌ షాకింగ్‌ నిర్ణయం.. అదే అతడి చివరి సినిమా అట!

  • Published Oct 05, 2023 | 5:12 PM Updated Updated Oct 05, 2023 | 5:12 PM
  • Published Oct 05, 2023 | 5:12 PMUpdated Oct 05, 2023 | 5:12 PM
అనుదీప్‌ షాకింగ్‌ నిర్ణయం.. అదే అతడి చివరి సినిమా అట!

‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా మారిపోయారు కేవీ అనుదీప్‌. జాతి రత్నాలు సినిమా తర్వాత తమిళంలో ‘ప్రిన్స్‌’ అనే సినిమా తీశారు. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజై దాదాపు సంవత్సరం అవుతున్నా.. అనుదీప్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్టు గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నటుడిగా మాత్రం ఓ సినిమాలో నటించారు. ఆయన నటించిన ‘మ్యాడ్‌’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు అనుదీప్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ షాకింగ్‌ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇకపై సినిమాల్లో నటించనన్నారు. మ్యాడీ సినిమానే తన చివరి సినిమా అని చెప్పుకొచ్చారు. మ్యాడ్‌ సినిమా దర్శకుడు కల్యాణ్‌ అడిగినందు వల్లే తాను ఆ సినిమాలో నటించానని చెప్పారు. ఆయన కోసమే ఆ సినిమాలో నటించానని, ఇకపై సినిమాల్లో నటించడానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.

కాగా, 2016లో వచ్చిన ‘పిట్టగోడ’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా తర్వాత చాలా ఏళ్లు గ్యాప్‌ ఇచ్చారు. దాదాపు ఐదేళ్ల తర్వాత 2021లో ‘జాతి రత్నాలు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అనుదీప్‌ కేమియో అప్పియరెన్స్‌ ఇచ్చారు. ప్రస్తుతం కొత్త సినిమా ఏదీ ప్రకటించకపోయినప్పటికీ.. కొన్ని ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఆయన రవితేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని టాక్‌. మరి, అనుదీప్‌ నటనకు దూరంగా ఉంటానని చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş