iDreamPost
android-app
ios-app

మరో టీవీ షోలో కుమారి ఆంటీ.. క్రేజ్ మామూలుగా లేదుగా!

  • Published Feb 12, 2024 | 11:48 AM Updated Updated Feb 12, 2024 | 11:48 AM

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒక్క డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కుమారీ ఆంటీ ఒకరు. ప్రస్తుతం కుమారి ఆంటీ టీవీ షోల్లో కూడా దర్శనమిస్తుంది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒక్క డైలాగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కుమారీ ఆంటీ ఒకరు. ప్రస్తుతం కుమారి ఆంటీ టీవీ షోల్లో కూడా దర్శనమిస్తుంది.

  • Published Feb 12, 2024 | 11:48 AMUpdated Feb 12, 2024 | 11:48 AM
మరో టీవీ షోలో కుమారి ఆంటీ.. క్రేజ్ మామూలుగా లేదుగా!

బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో టీవీ షోలు వచ్చాయి. జబర్ధస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఈ షోతో చాలా మంది నటులు బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై బిజీగా మారిపోయారు. అలాంటి వారిలో హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, శకలక శంకర్, చమ్మక్ చంద్ర ఇలా చాలా మంది నటులుగా తమ సత్తా చాటుతున్నారు. ఇక బలగం మూవీతో కమెడియన్ డైరెక్టర్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఈ మధ్యకాలంలో కొంతమంది తమ డైలాగ్స్ తో రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. అలాంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ గురించి తెలియని వారు ఉండారు. ఈ పాపులారిటీతో ఇప్పుడు బుల్లితెర లోకి ఎంట్రీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్నో సీరియల్స్, రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాలు గొప్ప వినోదాన్ని అందిస్తున్నాయి. అలాంటి వాటిలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఒకటి. ప్రతిభావంతులైన కళాకారులు తమ కామెడీ స్కిట్ లను ప్రదర్శిస్తుంటారు. సంగీతం, నృత్యంలో టాలెంట్ ఉన్నవాళ్లు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా తమ ప్రదర్శన ఇచ్చి మంచి పేరు, పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కుమారి ఆంటీ.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మాధ్యమాల ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఏకంగా రాష్ట్ర సీఎంలను సైతం తన వంటలతో కదిలించింది కుమారి ఆంటీ. ఇప్పుడు కుమారి ఆంటీ పాపులారిటీ టీవీ షోల్లో కనిపిస్తుంది. త్వరలో సినిమా ప్రమోషన్స్ లో కూడా వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Kumari Aunty Hungama with Adi!

హైదరాబాద్ లో ఒక ఏరియాలో మీల్స్ అమ్ముకునే కుమారి ఆంటీ ఆ మధ్య ‘మొత్తం 1000… రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అనే డైలాగ్ తో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై పాజిటీవ్, నెగిటీవ్  కామెంట్స్ వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి కుమారి ఆంటీ వద్దకు యూట్యూబర్స్, రీల్స్ చేసేవారు ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టారు. దీంతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.  ఇటీవల బీబీ ఉత్సవం అనే టీవీ షోలో కుమారి ఆంటీ పాల్గొని తెగ హంగామా చేసింది. ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో కూడా వచ్చేసింది. షోలో తన ఫుడ్ తీసుకొచ్చి అక్కడ ఉన్నవారందరికీ వడ్డించింది. ఈ కార్యక్రమంలో తనదైన పంచ్ లతో అదరగొట్టే హైపర్ ఆదీ, కుమారి ఆంటీతో భలే కామెడీ పండించాడు. ఆమె కుడా ఏమాత్రం తడబడకుండా అందరికి మంచి వినోదాన్ని పండించింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబందించిన ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet