iDreamPost
android-app
ios-app

Kumari Aunty: బుల్లితెరపైకి కుమారీ ఆంటీ.. వీడియో వైరల్‌

  • Published Feb 07, 2024 | 11:22 AM Updated Updated Feb 07, 2024 | 11:55 AM

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ.. తాజాగా ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న కుమారీ ఆంటీ.. తాజాగా ఆమె బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Feb 07, 2024 | 11:22 AMUpdated Feb 07, 2024 | 11:55 AM
Kumari Aunty: బుల్లితెరపైకి కుమారీ ఆంటీ.. వీడియో వైరల్‌

ఓ వారం రోజుల నుంచి కుమారీ ఆంటీ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. కుమారీ ఆంటీ ఫుడ్‌ స్టాల్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో బోలేడు వీడియోలు. రోజుకు ఆమె 60 వేల రూపాయలకు పైగా సంపాదిస్తుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వారం రోజుల క్రితం వరకు కేవలం సోషల్‌ మీడియా ఫాలో అయ్యే వారికి మాత్రమే కుమారీ ఆంటీ గురించి తెలుసు. అయితే ఎప్పుడైతే పోలీసులు ఆమె ఫుడ్‌ స్టాల్‌ని సీజ్‌ చేసి.. కేసు నమోదు చేశారో.. అప్పటి నుంచి ఆమె రేంజ్‌ పెరిగిపోయింది. ట్విట్టర్‌లో కుమారీ ఆంటీ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఈ అంశం ఎంత సంచలనంగా మారింది అంటే.. దీనిపై తెలంగాణ సీఎం స్పందించడం.. వెంటనే ఫుడ్‌ స్టాల్‌ తెరవడానికి అనుమతి లభించడం వంటివి చకచకా జరిగిపోయాయి. సీఎం స్పందనతో కుమారీ ఆంటీ క్రేజ్‌ ఎక్కడికో వెళ్లి పోయింది. ఇదిలా ఉండగా తాజాగా కుమారీ ఆంటీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆవివరాలు..

Kumari Aunty on the screen

కుమారీ ఆంటీ క్రేజ్‌ చూసి.. ఆమె నెక్స్ట్‌ బిగ్‌బాస్‌ సీజన్‌లోకి వస్తుందని అంతా ఫిక్సయ్యారు. అయితే ఆలోపే కుమారీ ఆంటీ ఈటీవీ షోలలో కనిపిస్తుందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. కుమారీ ఆంటీ స్టార్‌ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. కుమారీ ఆంటీ స్టార్‌ మా బీబీ ఉత్సవంలో సందడి చేసింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

స్టార్‌ మా నిర్వహించిన బీబీ ఉత్సవం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చింది కుమారీ ఆంటీ. పైగా షోలో పాల్గొన్నవారందరికి తన ఫుడ్‌ స్టాల్‌ నుంచే నాన్‌వెజ్‌ భోజనం తీసుకువచ్చి.. వారికి స్వయంగా వడ్డించినట్లు వీడియోలో ఉంది. దీనిలో కంటెస్టెంట్లు అందరూ చేతిలో విస్తరాకులు పట్టుకుని భోజనం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా ఉన్న శ్రీముఖి మా బీబీ ఉత్సవంలో మాకు కడుపు నిండా భోజనం పెట్టిన మా కుమారీ ఆంటీకి థాంక్స్‌ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండటంతో.. కుమారీ ఆంటీ క్రేజ్‌ రోజురోజుకు పెరుగుతుంది కదా.. త్వరలోనే ఏదైనా సీరియల్‌ లేదా బిగ్‌బాస్‌ షోలో కనిపించినా ఆశ్చర్యం లేదు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio