ఇండస్ట్రీలో స్టార్డమ్ వచ్చాక హీరోలైనా, హీరోయిన్స్ అయినా సొంతంగా ప్రొడక్షన్ లోకి దిగడం చూస్తున్నాం. ఇప్పటివరకు స్టార్స్ గా ఎదిగిన వారంతా ఏదొక మూవీ ద్వారా ప్రొడక్షన్ లోకి దిగినవారే. కొందరికి ముందు నుండి ప్రొడక్షన్ హౌసులు ఉండొచ్చు. కానీ.. కొందరు మాత్రం కష్టపడి స్టార్డమ్ సంపాదించుకొని చిన్నగా దిగుతున్నారు. ఇప్పుడు ఇదే వరుసలో జాయిన్ అవుతోంది స్టార్ హీరోయిన్ కృతిసనన్. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది. అ తర్వాత దోచేయ్ చేశాక మళ్లీ తెలుగులో కనిపించలేదు. రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీ చేసింది. ఇందులో రాముడిగా ప్రభాస్ నటించగా.. సీత క్యారెక్టర్ లో కృతి మెరిసింది.
ఇక తెలుగు కంటే ఎక్కువ బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కృతి.. బాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్స్ తో సినిమాలు చేసేసింది. కావాల్సినంత నేమ్, ఫేమ్ దక్కించుకుని.. ఇప్పుడు ప్రొడక్షన్ లో అడుగు పెడుతోంది. తన సోదరి నుపూర్ సనన్ తో కలిసి కృతి.. ‘బ్లూ బటర్ ఫ్లై’ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఇక ప్రొడక్షన్ హౌస్ పెట్టిందో లేదో అప్పుడే మొదటి సినిమా అనౌన్స్ కూడా చేసింది. ప్రొడ్యూసర్ గా కృతి నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ పేరు ‘దో పత్తి’. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సినిమాని కృతితో పాటు రైటర్ కనికా దిల్లాన్ కూడా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ నటి ఇన్నేళ్ల తన కెరీర్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది.
కృతి తన పోస్ట్ లో బటర్ ఫ్లై ఫిలిమ్స్ వీడియో షేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చింది. ‘ఇప్పుడు ఇండస్ట్రీలో చేయాల్సింది చాలా ఉంది. 9 ఏళ్లుగా నేను సినీ ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను. ముందు నుండి నా ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేశాను. ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని అనిపిస్తుంది. మీ మనసులు మెచ్చే కథలను చెప్పాలని భావిస్తున్నాను.’ అంటూ కృతి పేర్కొంది. దీంతో ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు, కృతి ఫ్రెండ్స్ అంతా ఆమెను విష్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృతి ప్రెజెంట్ గణపత్, ది క్రూ అనే మూవీస్ చేస్తోంది. మరి కృతి ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా విష్ చేయడం ట్విట్టర్ లో చూడవచ్చు.