iDreamPost
android-app
ios-app

ప్రభాస్‌ జాతకం వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసు! వేణు స్వామికి ఎలా తెలిసింది? : కృష్ణం రాజు భార్య

  • Published Jan 20, 2024 | 6:09 PM Updated Updated Jan 20, 2024 | 6:09 PM

Krishnam Raju Wife About Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్‌పై చేసిన కామెంట్లపై కృష్ణంరాజు భార్య స్పందించారు. ప్రభాస్‌ జాతకం వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసునని, బయటి వాళ్లకు తెలియదని అన్నారు.

Krishnam Raju Wife About Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్‌పై చేసిన కామెంట్లపై కృష్ణంరాజు భార్య స్పందించారు. ప్రభాస్‌ జాతకం వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసునని, బయటి వాళ్లకు తెలియదని అన్నారు.

  • Published Jan 20, 2024 | 6:09 PMUpdated Jan 20, 2024 | 6:09 PM
ప్రభాస్‌ జాతకం వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసు! వేణు స్వామికి ఎలా తెలిసింది? : కృష్ణం రాజు భార్య

ప్రభాస్‌ ఆరోగ్యం, సినిమా కెరీర్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ‘‘నేను ఇప్పటివరకు సెలబ్రిటీలకు చెప్పిన జ్యోతిష్యం ఎప్పుడూ తప్పు కాలేదు. చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. ప్రభాస్‌కు నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం అతని జాతకంలో దోషం ఉండ‌డ‌మే. దోషం కారణంగా పెళ్లి ఆలస్యం అవుతుంది. ఒకవేళ కష్టాలను అధిగమించి పెళ్లి చేసుకున్నా కలిసి రాదు’’ అని వేణు స్వామి అన్నారు.

సలార్‌ సినిమా విడుదల సమయంలోనూ ప్రభాస్‌పై కామెంట్లు చేశారు. ప్రభాస్‌కు ఆరోగ్యం బాగోలేదని అన్నారు. సలార్‌ మూవీ ప్లాప్‌ అవుతుందని తేల్చేశారు. అయితే, ఆయన అన్నదానికి భిన్నంగా సలార్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయింది. ఇక, ప్రభాస్‌ పెళ్లి, ఆరోగ్యంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ సోషల్‌ మీడియాలో కింద ఒకటి రాస్తారు. చూపించేది ఒకటి.

We also don't know about Prabhas horoscope

దాని వల్ల వాళ్లకు ఉపయోగం ఉంటదో నాకు తెలీదు. ఎవరైనా సంతోషంగా ఉంటే.. మాకు కూడా సంతోషంగా ఉంటుంది. కొన్ని కొన్ని మరీ ఇబ్బందికరమైనవి ఉంటాయి. వీటి వల్ల పెద్దగా బాధ ఎక్కడా రాదు. ఏమనుకున్నాకూడా.. వాళ్లకు కూడా మా ఫ్యామిలీ గురించి తెలుసు. వాళ్లు అందరూ రెస్పెక్ట్‌గానే ఉంటారు. రెస్పెక్ట్‌ ఇస్తారు. కానీ, నాకు ఎక్కడ వస్తుందంటే.. ఆ వేణు స్వామి హెల్త్‌ గురించి అంటే .. బాబు జాతకం గురించి చెప్పినపుడు మాత్రం బాధేస్తుంది. మొన్న ఎవరో చెబితే తెలిసింది.

ప్రభాస్‌ గారి జాతకం వాళ్ల మదర్‌కు తప్ప వేరే వాళ్లకు తెలీదు. అలాంటిది ఆ వేణు స్వామికి ఎలా తెలిసింది. అవన్నీ పుకార్లు.. వేరే వాళ్లు బాధపడతారు కదా.. మేడమ్‌ మీరే అడగండి అంటూ ఉంటారు. నేనెందుకు అడగడం అని ఊరుకుంటూ ఉంటాను. పుకార్లని మీరే కదా చెబుతున్నారు. ఏం కాదు. ఊరుకోండి అంటూ ఉంటాను. మీరెవ్వరూ పట్టించుకోకండి అంటుంటాను. మాకు ఎవరినీ ఏమీ అనే అలవాటు లేదు. కృష్ణం రాజు గారు అజాతశత్రువు. ఆయన్ను అనే వాళ్లు ప్రపంచలోనే లేరు. కానీ, 100లో ఓ పర్సెంట్‌ అనే వారు ఉండేవారు. ఆయన పెద్దగా పట్టించుకునే వారు కాదు. మరి, శ్యామలా దేవి.. వేణు స్వామిపై స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet