iDreamPost
android-app
ios-app

Krishna Vrinda Vihari : రూటు మార్చిన కుర్ర హీరో

  • Published Mar 28, 2022 | 3:23 PM Updated Updated Mar 28, 2022 | 3:24 PM
  • Published Mar 28, 2022 | 3:23 PMUpdated Mar 28, 2022 | 3:24 PM
Krishna Vrinda Vihari : రూటు మార్చిన కుర్ర హీరో

ఛలో తర్వాత ఆ స్థాయి హిట్టు లేక సతమతమవుతున్న హీరో నాగ శౌర్య కొత్త సినిమా కృష్ణ వ్రింద విహారి వచ్చే నెల 22న విడుదల కానుంది. ఇవాళ టీజర్ ని రిలీజ్ చేశారు. గతంలో వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ ని బట్టి ఇదేదో కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అనుకున్నారు కానీ ఈ రోజు వచ్చిన టీజర్ చూశాక ఇందులో రొమాన్స్ పాలు గట్టిగానే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. హీరోయిన్ షిర్లే సెతియా మొహమాట పడకుండా మంచి కెమిస్ట్రీని చూపించడం యూత్ ని ఆకట్టుకొంటోంది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ కు నిర్మాతలు స్వయానా నాగ శౌర్య తల్లి తండ్రులే. వాళ్ళ హోమ్ బ్యానర్ లోనే ఇది రూపొందుతోంది.

ఫ్లాపుల దెబ్బకు నాగ శౌర్య రొమాన్స్ డోస్ పెంచినట్టు కనిపిస్తోంది. లిప్ లాక్ కిస్సులతో పాటు షిర్లేతో చేసిన సన్నివేశాల్లో ఇంటిమసీ బాగానే పండింది. గతంలో ఈ టైపులో తను సినిమాలు చేసింది లేదు. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా టైటిల్ పెట్టిన టీమ్ టార్గెట్ మాత్రం యువతనే పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. టీజర్ లో కథను సింపుల్ గా చెప్పేశారు. ఓ అమ్మాయిని చూసి ఓ అబ్బాయి మనసు పారేసుకుంటాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతున్న టైంలో ఆమె ఎందుకో నో చెబుతుంది. అయినా ఇతగాడు పట్టు వదలడు. వెంటపడతాడు. బ్రతిమాలుతాడు. చివరికి తన లవ్ ని గెలిపించుకున్నాడా లేదా అనేదే ఇందులో పాయింట్.

స్టోరీ పరంగా చూస్తే పెద్దగా కొత్తదనం అనిపించడం లేదు కానీ ట్రీట్మెంట్ అండ్ ఎంటర్ టైన్మెంట్ మీదే కథనం నడిపించినట్టు కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. నాగ శౌర్య ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుడు కావలెను ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో ఇలా రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. అయినా కంటెంట్ బలంగా ఉండాలే కానీ రొమాన్స్ ఉన్నా లేకపోయినా జనం ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ మాటకొస్తే ఛలోలో అసలు ఆ ప్రస్తావనే ఉండదు. ఏప్రిల్ 22న విడుదల కాబోతున్న కృష్ణ వ్రింద విహారి అదే రోజు సుమ టైటిల్ రోల్ చేసిన జయమ్మ పంచాయితీ, విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో పోటీ పడనుంది

Teaser : https://www.youtube.com/watch?v=bQtMpo9lmAY 

Also Read : SS Rajamouli & Mahesh Babu : రాజమౌళి కొత్త సినిమాలో ఊహించని బ్యాక్ డ్రాప్

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio