iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి వంగ సినిమాలు తీయడం వెనుక ఇంత కష్టం ఉందా..!

  • Published Nov 06, 2024 | 4:57 PM Updated Updated Nov 06, 2024 | 4:57 PM

సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఈ దర్శకుడు పేరు తెలియని వారు ఎవరు లేరు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఈ దర్శకుడు కూడా ఒకరు. అయితే తెరపైన హీరోలతో సెన్సేషన్ క్రియేట్ చేసే దర్శకుడి వెనుక చాలా కష్టమే ఉంది. అదేంటో చూసేద్దాం.

సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఈ దర్శకుడు పేరు తెలియని వారు ఎవరు లేరు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఈ దర్శకుడు కూడా ఒకరు. అయితే తెరపైన హీరోలతో సెన్సేషన్ క్రియేట్ చేసే దర్శకుడి వెనుక చాలా కష్టమే ఉంది. అదేంటో చూసేద్దాం.

  • Published Nov 06, 2024 | 4:57 PMUpdated Nov 06, 2024 | 4:57 PM
సందీప్ రెడ్డి వంగ  సినిమాలు తీయడం వెనుక ఇంత కష్టం ఉందా..!

ఇండస్ట్రీలో నెగ్గుగు రావడం అంత ఈజీ అయితే కాదు. అది ఒక హీరోకైనా.. ఓ దర్శకుడికైనా అదే కష్టం ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ. తీసిన కొద్దీ సినిమాలతోనే ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం సందీప్ కు మాత్రమే సాధ్యం. కానీ రీసెంట్ గా సందీప్ గురించి వినిపిస్తున్న న్యూస్ వింటే మాత్రం.. ఈ దర్శకుడి వెనుక ఇంత కష్టం ఉందా అని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. విజయ్ దేవరకొండ, సందీప్ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. అప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన తెలుగు సినిమాలకు ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది . అయితే ఈ అవకాశాన్ని దక్కించుకోవడం వెనుక.. సందీప్ పడిన ఎన్నో అవమానాలు ఉన్నాయట. సందీప్ రెడ్డి ఎప్పుడు వీటి గురించి చెప్పుకున్నది లేదు. కానీ రీసెంట్ గా రైటర్ కోన వెంకట్ సందీప్ కష్టాలని చెప్పుకొచ్చారు.

అర్జున్ రెడ్డి సినిమా కోసం ఏకంగా ఐదేళ్లు హీరోల వెంట తిరిగాడట సందీప్. ఓ హీరో దీని మీద ఆసక్తి చూపించి ఆ సినిమా మీద వర్క్ చేసే అవకాశం కల్పించాడట. కానీ అలానే చూద్దాం చేద్దాం అనుకుంటూ మూడేళ్లు గడిపేశాడట ఆ హీరో. అతనికి సినిమా చేసే ఉద్దేశం లేదని అర్ధమయ్యి సందీప్ అక్కడినుంచి వచ్చేసాడట. ఆ తర్వాత మరో హీరోకు కథ చెప్పగా.. అతను కూడా రెండేళ్ల పాటు వెనుక తిప్పించుకోవడమే కానీ.. సినిమాకు మాత్రం ఒకే చెప్పలేదట. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ సందీప్ ను నమ్మి ఒకే చెప్పడంతో… అర్జున్ రెడ్డి సినిమా పట్టాలెక్కిందని చెప్పుకొచ్చారు. కానీ ఆ ఇద్దరు హీరోలు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అలా సందీప్ తీసింది మూడు సినిమాలే. అందులో రెండు ఒకే కథతో వేర్వేరు భాషల్లో తెరకెక్కినవే. అయినా సరే ఇప్పుడు సందీప్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడయ్యాడు. ఏదేమైనా సందీప్ కు సినిమా మీద ఉన్న కసి ఏంటో.. తాను తీసిన రెండు సినిమాలలోనే చూపించాడు. అందుకే ఇప్పుడు సందీప్ కోసం స్టార్ హీరోలంతా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు సందీప్ క్రేజ్ మాములుగా లేదు. ఈ డైరెక్టర్ పేరు మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఏకంగా నాలుగో సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్ లో పెట్టేసాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సందీప్ , ప్రభాస్ కాంబినేషన్ లో రాబోయే స్పిరిట్ గురించే టాక్ నడుస్తుంది. ఈ సినిమా నుంచి రోజుకు ఒక వార్త వినిపిస్తుంది. ఇవన్నీ కూడా రోజు రోజుకి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. ప్రభాస్ తో కలిసి సందీప్ చేయబోయే మ్యాజిక్ కోసం అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత రణ్ బీర్ తో యానిమల్ పార్క్ ఉండనే ఉంది. రానున్న రోజుల్లో సందీప్ ఇంకా ఎలాంటి కథలను తీసుకొస్తాడో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet