iDreamPost
android-app
ios-app

నటి రాధపై పోలీసు కేసు! కారణం ఏంటంటే..?

  • Published Mar 21, 2024 | 9:37 AM Updated Updated Mar 21, 2024 | 9:37 AM

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినన సెలబ్రిటీస్ వరుస వివాదాలు, విమర్శలు, లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కామన్ అయిపోయింది. తాజాగా మరో నటి పై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కారణం తెలిస్తే షాక్ అయిపోతారు.

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినన సెలబ్రిటీస్ వరుస వివాదాలు, విమర్శలు, లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కామన్ అయిపోయింది. తాజాగా మరో నటి పై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కారణం తెలిస్తే షాక్ అయిపోతారు.

  • Published Mar 21, 2024 | 9:37 AMUpdated Mar 21, 2024 | 9:37 AM
నటి రాధపై పోలీసు కేసు! కారణం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ కు వివాదాలు , విమర్శలు, లేనిపోని ఇబ్బందుల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో ఎంత త్వరగా ఫేమస్ అవుతారో, అంతే త్వరగా లేనిపోని వివాదాల్లో చిక్కుకొని ట్రోల్స్ కు గురవుతారు. అసలు సెలబ్రిటీగా పేరను సంపాదించుకోవడం ఎంత కష్టమో.. దాని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. అందుచేతనే ఈ రంగులు ప్రపంచంలో అచి తూచి అడుగులు వేస్తూ ఉండాలి. కానీ, ఈ విషయాలను కొంతమంది పెడచెవిన పెడుతుంటారు. ఈ క్రమంలోనే.. ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ తెచ్చుకుంటే చాలు.. ఎక్కడలేని గర్వం తలకెక్కిపోతుంది. ఆ గర్వంతో వారు ఏం చేస్తున్నారో వారికే అర్ధం కాకుండా ప్రవర్తిస్తూ లేని పోని కేసుల్లో ఇరుక్కుంటూ వార్తలో నిలుస్తుంటారు. అయితే ఇప్పుడు నటి ‘రాధ’ కూడా ఇదే కోవకు చెందినదే. ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఈమె పై పోలీసు కేసు నమోదైంది. కారణం తేలిస్తే ఆశ్చర్యపోతారు.

కోలీవుడ్‌లో ‘సుందరాట్రావెల్స్‌’, ‘అదావతి’, ‘మనస్థాన్’, ‘కధవరాయన్’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు పొందిన నటి రాధ. ఈమె నెల్లూరుకు చెందినది కాగా, సినిమా అవకాశాల కోసం చెన్నై కు మకాం మార్చింది. అక్కడ పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్సులు దక్కించుకుని మంచి పాపులారీటిని సంపాదించుకుంది. కానీ, ప్రస్తుతం రాధ పలు టీవీ సీరియళ్లలో నటిస్తుంది. ఇక ఈమెకు తరుణ్‌ అనే కుమారుడు ఉండగా.. వీరు చెన్నైలోని సాలిగ్రామంలో నివసిస్తున్నారు. అయితే తాజాగా నటి రాధ పై పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. చెన్నైలోని రాధ ఇంటి సమీపంలో ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నాడు.

Police case against actress Radha

కాగా, రాత్రి ప్రాన్సిస్‌ ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన నటి రాధ, ఆమె కుమారుడు తరుణ్‌.. అతనిపై దాడి చేసి కొట్టారు. దీంతో ఫ్రాన్సిన్‌ రిజర్డ్‌ తండ్రి డేవిడ్‌ రాజ్‌ నటి రాధ, ఆమె కొడుకు తరుణ్‌పై విరుగంబాక్కమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తన కొడుకుపై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అయితే నటి రాధ.. ఫ్రాన్సిస్‌ రిజర్డ్‌పై దాడి చేసిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో చోటు చేసుకున్న విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. కాగా, ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌ ఇంతకు ముందు నటి రాధపై వ్యంగంగా ప్రవర్తించినందుకు గానూ.. అతనిపై ఇంతకు ముందు ఆమె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే.. నటి రాధ, ఆమె కొడుకు ఫ్రాన్సిస్‌ రిచర్డ్‌పై దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ, రాధ గతంలో కూడా పలు వివాధాల వల్ల కోలివుడ్‌ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. భర్తతో గొడవలు,వివాహేతర సంబంధాలు,నిర్మాతల వేధింపులపై ఆమె కామెంట్లు ఇలా పలు విషయాల పై ఆమె ఎప్పుడు నెట్టింట హట్ టాపిక్ గా మారేది. మరి, దాడి చేసిన ఘటనలో నటి రాధ పై పోలీసు కేసు నమోదు కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom