iDreamPost
android-app
ios-app

విజయ్ ఎత్తుకున్న ఈ బాబు ఎవరో తెలుసా..? స్టార్ హీరోయిన్ కొడుకు

  • Published Jul 17, 2024 | 9:25 PM Updated Updated Jul 17, 2024 | 9:26 PM

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్ర షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ రేసులో ఉంది. ఇదిలా ఉంటే.. విజయ్ చేతిలో ఉన్న ఈ బాబు ఎవరో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్ర షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ రేసులో ఉంది. ఇదిలా ఉంటే.. విజయ్ చేతిలో ఉన్న ఈ బాబు ఎవరో తెలుసా..?

  • Published Jul 17, 2024 | 9:25 PMUpdated Jul 17, 2024 | 9:26 PM
విజయ్ ఎత్తుకున్న ఈ బాబు ఎవరో తెలుసా..?  స్టార్ హీరోయిన్ కొడుకు

కోలీవుడ్ క్రేజీయెస్ట్, మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో ఒకరు ఇళయ దళపతి విజయ్. తన డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌లో కూడా మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఇటీవల కాలంలో తన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజై అవుతుంది. కత్తి, తేరీ మూవీలతో టీటౌన్‌లో కూడా అభిమానుల్ని సొంత చేసుకున్న విజయ్.. వారసుడు (వారిసు)సినిమాతో మరింత చేరువయ్యాడు. దీంతో లియోను తమిళంలో కన్నా ఇక్కడి ప్రేక్షకులే ఎక్కువ ఆదరించారు. ఇదిలా ఉంటే సినిమాల పరంగానే కాకుండా సోషల్ యాక్టివిటీలోనూ ముందు వరుసలో ఉంటాడు. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్.. పార్టీ పేరును ఎనౌన్స్ చేసిన సంగతి విదితమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయనుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజకీయాల కోసం సినిమాలు వైదొలుగుతాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజిలెస్కో సాంగ్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా బాణీలు సమకూరుస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. రూ. 300 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది.ఈ మూవీ ప్రస్తుతం కెనడాలో జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఓ స్క్రీన్ జంట మరోసారి కలిసింది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఇది ఒకటి.

విజయ్ ఎత్తుకున్న ఈ బాబు ఎవరో తెలుసా..? ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ విజయలక్ష్మీ అలియాస్ రంభ కొడుకు. కెనడాలో ఇళయదళపతిని కలిసింది ఒకప్పటి స్టార్ నటి రంభ. వీరిద్దరూ గతంల నినైతెన్ వందై (పెళ్లి సందడి రీమేక్)లో కలిసి నటించారు. దీప్తి భట్నాగర్ పాత్రను రంభ పోషించింది. ఈ జంటకు తమిళనాడులో ఫ్యాన్ బేస్ ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఈ రీల్ కపుల్ కలిశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది రంభ. చాలా రోజుల తర్వాత విజయ్‌ను కలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పంచుకుంది.

భర్త, తన ముగ్గురు పిల్లలు, విజయ్ ఉన్న పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రంభ.. దక్షిణాదితో పాటు హిందీ, బెంగాలీ, భోజ్ పురీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓ తరం హీరోలందరి సరసన ఆడిపాడింది. ఆమె డ్యాన్స్ చేస్తే ఫిదా అయిపోయేవారు ఆడియన్స్. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమె డ్యాన్స్ కొనియాడేవారంటే.. ఆమె ఎంతటి ఫెర్మామరో అర్థం చేసుకోవచ్చు. 2010లో తిరుపతిలో కెనడాకు చెందిన శ్రీలంక తమిళ వ్యాపార వేత్తను చేసుకుని సెటిల్ అయ్యింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş