iDreamPost
android-app
ios-app

ఇంటస్ట్రీలో విషాదం.. శివపుత్రుడు నిర్మాత కన్నుమూత

  • Published Oct 03, 2023 | 10:47 AM Updated Updated Oct 03, 2023 | 10:47 AM
  • Published Oct 03, 2023 | 10:47 AMUpdated Oct 03, 2023 | 10:47 AM
ఇంటస్ట్రీలో విషాదం.. శివపుత్రుడు నిర్మాత కన్నుమూత

కోలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఇక దురై నిర్మించిన చిత్రాల్లో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం శివపుత్రుడు. సూర్య-విక్రమ్‌ హీరోలుగా పితామగన్‌ పేరుతో తెరకెక్కి ఈ సినిమాకు వీఏ దురై నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగులో శివపుత్రుడుగా విడుదలై.. సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో హీరో విక్రమ్‌ మతి స్థిమితం లేని పిచ్చి వ్యక్తి పాత్రలో నటించి అలరించాడు. ఇందుకుగాను విక్రమ్‌ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

వీఏ దురై.. కోలీవుడ్‌లో అనేక హిట్‌ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కోలీవవుడ్‌ స్టార్‌ హీరోలైన రజనీకాంత్‌, విజయకాంత్‌, విక్రమ్‌, సూర్య, సత్యరాజ్‌ వంటి వారందరితో సినిమాలు నిర్మించారు. దురై నిర్మించిన చివరి చిత్రం.. గజేంద్ర. అయితే కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో.. దురై ఆర్థికంగా నష్టపోయారు. కనీసం వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందిపడ్డారు. కొన్ని రోజుల క్రితం తన ఆర్థిక పరిస్థితి ఏం బాగా లేదు ఆదుకోమంటూ.. దురై ఓ వీడియో విడుదల చేశారు. అప్పట్లో ఇది బాగా వైరల్‌ అయ్యింది. దీనిపై హీరో సూర్య స్పందించాడు. దురైకి సాయం చేశాడు.

ఇక దురై కుటుంబం విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. రెండో భార్యకు ఓ కూతురు సంతానం ఉన్నారు. ఇక దురై మరణం పట్ల కోలీవుడ్‌ పెద్దలు, స్టార్‌ మీరోలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş