iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరోకు నో చెప్పిన లవ్ టుడే భామ.. కారణమిదే?

  • Published Dec 06, 2023 | 9:06 PM Updated Updated Dec 06, 2023 | 9:06 PM

లవ్ టుడే ఫేమ్ నటి ఇవాన ఆ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ ముద్దుగుమ్మ ఆ హీరో సినిమాను వదులుకోవడానికి కారణం అదేనట?

లవ్ టుడే ఫేమ్ నటి ఇవాన ఆ స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ ముద్దుగుమ్మ ఆ హీరో సినిమాను వదులుకోవడానికి కారణం అదేనట?

  • Published Dec 06, 2023 | 9:06 PMUpdated Dec 06, 2023 | 9:06 PM
ఆ స్టార్ హీరోకు నో చెప్పిన లవ్ టుడే భామ.. కారణమిదే?

కేరళ ముద్దుగుమ్మ ఇవాన గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా లవ్ టు డే సినిమాలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అయితే ఈ సినిమా భారీ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో టాలివుడ్ కి పరిచయమైన ఇవాన ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్ లో మంచి క్రేజ్‌ ను సంపాదించుకుంది. ఇక తన అందం అభినయంతో.. అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈమె మొదటగా బాల దర్శకత్వం వహించిన నాచ్చియార్ సినిమాతో.. జీవీ ప్రకాష్ కుమార్ లవర్ గా నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

లవ్ టుడే సినిమా తర్వాత ఇవానకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అలా హరిష్ కళ్యాణ్ కు జంటగా ఎల్ జీ ఎం చిత్రంలో నటించింది. అయితే ఎంఎస్ ధోని నిర్మించిన ఆ చిత్రం అశించిన విజయాన్ని సాధించలేదు. అదే సమయంలో.. ఇవాన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందంటూ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో.. ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఇవానాకు కోలీవుడ్ హీరో విజయ్‌తో కలిసి నటించే బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. కానీ.. ఈ సినిమాలో విజయ్ తో తాను నటించనని రిజెక్ట్ చేసిందట. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఇవానకు తమిళ్ హీరో విజయ్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాలో బిజీగా ఉన్నాడు. వెంకట ప్రభు దర్శకత్వం వ‌హిస్తున్నఈ సినిమాలో.. విజయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక ఈ సినిమాలో స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, యోగి బాబు, ప్రేమ్‌జీ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇవానాకు నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని ఇవాన చేజార్చుకుంది. దీనికి కారణం.. ఈ సినిమాలో విజయ్‌కు చెల్లెలుగా ఇవానా నటించే అవకాశం రావడమేనట.

ఇప్పటికే ఇవాన కెరీర్ ట్రాక్ తప్పిన క్రమంలో ఉంది. కనుక ఇప్పుడు చెల్లెలు పాత్రలో నటిస్తే ఆ తర్వాత అన్ని అలాంటి పాత్రలే వస్తాయనే భయంతో ఇవానా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా విజయ్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని ఈ బ్యూటీ మిస్ చేసుకోవడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనవసరంగా స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు క‌దా అంటూ.. నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ఇవాన ఈ మూవీని రిజక్ట్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş