iDreamPost
android-app
ios-app

ఈ తమిళ నటుడు గుర్తున్నాడా? పైకే కమెడియన్! బ్యాగ్రౌండ్ వేరే లెవల్!

  • Published Aug 07, 2024 | 3:36 PM Updated Updated Aug 07, 2024 | 3:55 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కమెడియన్ ను గుర్తుపట్టారా.. ఇంతకీ ఆయన ఎవరు? ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు? ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలు తెలిస్తే షాక్ అవుతారు.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ కమెడియన్ ను గుర్తుపట్టారా.. ఇంతకీ ఆయన ఎవరు? ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు? ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలు తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Aug 07, 2024 | 3:36 PMUpdated Aug 07, 2024 | 3:55 PM
ఈ తమిళ నటుడు గుర్తున్నాడా? పైకే కమెడియన్! బ్యాగ్రౌండ్ వేరే లెవల్!

సినీ ఇండస్ట్రీలో కామెడీని పండించడం అంతా సులభమైన విషయం కాదు. ఎందుకంటే.. కామెడీని పండించడమంటే.. ప్రేక్షకులతో కడుపుబ్బా నవ్వించాలి. అలా నవ్వించడం ఒక ఆర్ట్. దానికి స్పెషల్ టాలెంట్ ఉండాలి. ముఖ్యంగా ఇండస్ట్రీ ఏదైనా సరే ప్రేక్షకుల మదిలో ఫలానా కమెడిన్ అంటూ గుర్తుండిపోయోలా చెరగని ముద్ర వేసుకోవాలి. ఇప్పటికే ఆ కేటగిరిలో టాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలామంది స్టార్ కమెడియన్స్ ఉన్నారు. మరీ ఆ జాబితాలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ కమెడియన్ కూడా ఒకరు. ఆయన మరెవరో కాదు.. ‘మొట్టా రాజేంద్రన్‘. ఈయననే ‘నాన్ కడవుల్ రాజేంద్రన్’ అని కూడా అంటారు.

అయితే ఈ పేరుతో పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. హీరో సూర్య ‘సింగం 2’ మూవీలో విలన్ క్యారెక్టర్ సహయం అంటే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. మరీంత ఈజీగా చెప్పాలంటే.. విజయ్ దళపతి ‘పోలీసోడు'(తేరి) మూవీలో విజయ్ పక్కనే పోలీసు ఆఫీసర్ రాజేందర్ అన్నా ఇంక ఈజీగా గుర్తుపట్టేస్తారు. మరీ అయినా ఎవరో ఐడియా వచ్చే ఉంటుంది కదా. ఇంతకీ ఆయన ఎవరు? ఎలా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు? ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టా రాజేంద్రన్.. చూడటానికి బక్కగా.. గుండు తలతో, డిఫరెంట్ వాయిస్ తో సినిమాల్లో కనిపిస్తాడు. అయితే ఈయన తమిళనాడులోని 1957 జూన్ 1న తూత్తుకుడిలో జన్మించాడు. ఇకపోతే ఈయన కామెడీ అంటే.. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియాన్స్ కూడా తెగ ఎంజాయ్ చేస్తారు. కానీ, నిజానికి ఈయన మొదటిగా ఇండస్ట్రీలోని హీరోలకు స్టంట్ కు డూప్ గా, డబుల్ గా నటించేవాడు. ఇలా 500కు పైగా చిత్రాల్లో స్టంట్ గా వర్క్ చేశాడు. ఇక ఆ తర్వాత తమిళ్ లోని 2003లో ‘పితామగన్’ అనే సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు.

Nankadavul Rajendran

ఈ క్రమంలోనే.. పలు సినిమాల్లో నటుడిగా అలరించాడు రాజేంద్రన్. అయితే ఓ రోజు చెన్నైలోని కళపేటలో ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా ఈయన విజయ్ రాఘవేంద్ర అనే నటుడిని కొట్టి పక్కనే ఉండే చెరువులో పడిపోవాలి. కానీ, చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వలన ఆ చెరువులో పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి చెందిన రసాయనాల కలిసివున్నాయి. ఇక అవేవీ తెలియనీ రాజేంద్రన్ ఆ చెరువులో దూకేశాడు. దీంతో అతని జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇక డాక్టర్స్ కూడా భవిష్యత్తులో జుట్టు పెరిగే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. ఇక కొన్నాళ్లకి ఆయన కను బొమ్మల జుట్టు కూడా ఊడిపోయింది. అలాగే ఆయన మొహం మొత్తం రఫ్ గా తయారైంది. ఇక ఆ రసాయనాల నీరు కడుపులోకి వెళ్లిపోవడంతో..ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేయి. ముఖ్యంగా జీర్ణశాయం, ఇతర శ్వాసకోస సమస్యలు వచ్చాయి. కానీ, నిజానికి ఆయన దగ్గర చికిత్సకు డబ్బులు కూడా లేవు. ఇక ఇండస్ట్రీలో కూడా ఈయనకు ఎవరు సాయం చేయలేదు. దీంతో ఆయన రూపం మొత్తం మారిపోవడంతో.. ఏమాత్రం కుంగిపోని రాజేంద్రన్ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే కమెడియన్ గా పలు సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. అంతేకాకుండా..మరోవైపు విలన్ గా కూడా పలు సినిమాల్లో అలరించాడు. ఇలా ఓ వైపు కమెడియన్ గా, మరో వైపు నటుడిగా సుమారు 160కు పైగా సినిమాల్లో రాజేంద్రన్ నటించాడు.  అయితే ఈయనకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టని సినిమాలు సింగం3, తేరి, రాజా రాణి, కాంచన 2, అరుణ్మనై 4 వంటి సినిమాల్లో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే రాజేంద్రన్ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు. కాగా, వాటిలో లక్ష్మీ నరసింహ,గుడుంబా శంకర్, సఖియా, శ్రీ, కితకితలు , అతిది, చలో, చీకటి గదిలో చితకోటుడు, సమ్మతమే వంటి చిత్రల్లో నటించగా.. అవి ఏవీ రాజేంద్రన్ కు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇకపోతే ఎఫ్ 3, వాల్తేరు వీరయ్య, సర్, విమానం వంటి సినిమాలతో మాత్రం రాజేంద్రన్ కు తెలుగు మంచి ఫేమ్ ను తెచ్చిపెట్టాయి.

Nankadavul Rajendran

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాజేంద్రన్ వయసు 67 ఏళ్లు. ఇక రాజేంద్రన్ కు ఓ నటితో వివాహం అయిందని రూమర్స్ బాగా వినిపించాయి. కానీ, నిజానికి ఆయన వివాహం చేసుకున్నట్టు ఎక్కడ అతని ఫ్యామిలీకి సంబంధించి సమాచారం తెలియరాలేదు. ఇకపోతే ఎన్నో సినిమాల్లో అలరించిన రాజేంద్రన్ కు ఆస్తి కూడా బాగానే ఉంది. ముఖ్యంగా చెన్నైలో ఈయనకు సుమారు రూ.15 కోట్లు ఇల్లు ఉందట. అంతేకాకుండా.. 3 లగ్జరీ కార్లు కూడా ఉన్నయట. ఇకపోతే ఎంత ఆస్తి ఉన్నా రాజేంద్రన్ చాలా సింఫుల్ గా ఉంటడం ఆయన గొప్పతనం. పైగా 67 ఏళ్ల వయసులో సినిమాల కోసం ఆయన ఎంతో ఫిట్ గా కనిపిస్తుంటాడు. మరీ, తమిళ్ కమెడియన్ రాజేంద్రన్ బ్యాక్ గ్రౌండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş