iDreamPost
android-app
ios-app

ఆస్పత్రిలో బెడ్ పై కమల్ హాసన్ సోదరుడు.. ఏం జరిగిందంటే!

  • Published Jul 30, 2024 | 4:27 PM Updated Updated Jul 30, 2024 | 4:27 PM

Charu Hasan: ప్రముఖ కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ ఆస్పత్రిలో చేరారు. ఆయన బెడ్ పై ఉన్న ఫోటోలను వారి కుమార్తె ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

Charu Hasan: ప్రముఖ కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ ఆస్పత్రిలో చేరారు. ఆయన బెడ్ పై ఉన్న ఫోటోలను వారి కుమార్తె ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే...

  • Published Jul 30, 2024 | 4:27 PMUpdated Jul 30, 2024 | 4:27 PM
ఆస్పత్రిలో బెడ్ పై కమల్ హాసన్ సోదరుడు.. ఏం జరిగిందంటే!

సినీ, రాజకీయ రంగానికి చెందిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇదే సమయంలో సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రముఖుల సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై ప్రత్యక్షమై కనిపిస్తుంటారు. అలానే తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్  అన్నయ్య చారు హాసన్ ఆస్పత్రిలో చేరాడు. ఆయన బెడ్ పై ఉన్న బెడ్ పై ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  ఈ క్రమంలో కమల్ హాసన్ అభిమానులు అసలు ఏం జరిగిందా అనే ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే…

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ సంపాదించారు. ఇటీవలే భారతీయుడు-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే.. ఆయన అన్నయ్య చారు హాసన్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 93 ఏళ్ల వయసులో కూడా చారు హాసన్ యాక్టివ్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చేరారు. తన తండ్రితో ఆసుపత్రిలో ఉన్న ఫోటోను తీసి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నటీ సుహాసిని పోస్ట్ చేశారు. ఆమె తండ్రి మెడికల్ వెకేషన్‌లో ఉన్నారని, డాక్టర్లు, నర్సులు, బిడ్డల సంరక్షణతో ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే ఆరోగ్య పరీక్షల నిమిత్తం అక్కడి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్నికి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం.

కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ తమిళం తో పాటు సౌత్ ఇండియాలోని ఇతర భాషల్లో కూడా నటించారు. ఇక చారు హాసన్ కమల్ కంటే 23 ఏళ్ల పెద్దవాడు. హిందీలో కూడా చారు హాసన్ అనేక సినిమాల్లో నటించారు. కన్నడ మూవీ తబరణలో నటనకు గానూ చారు హాసన్ కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కింది. చారు హాసన్ 1979లో మహేంద్రన్ దర్శకత్వం వహించిన ఉతిరిప్ పూకేమ్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు.

చారు హాసన్ ఈ వయసులో కూడా విజయ్ శ్రీ దర్శకత్వంలో హర అనే సినిమాలో నటించారు.  చారు హాసన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలను తీశారు. ఆయన న్యూ సంగమం, ఐపీసీ 215 అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన నటుడిగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా 120కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక చారు హాసన్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వారిలో ఒకరే ప్రముఖ నటి సుహాసిని. తమిళ చిత్రసీమలో టాప్ హీరోయిన్ గా సుహాసిని పేరు తెచ్చుకున్న సంగతి తెలిసింది. ఆమె దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుని స్థిర పడిపోయారు. ప్రస్తుతం సుహాసినితో చారు హాసన్ ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Suhasini Hasan (@suhasinihasan)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom