iDreamPost
android-app
ios-app

సింపుల్‏గా కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి జ్ఞాపకంగా ఏం చేశారంటే

  • Published Mar 29, 2024 | 4:14 PM Updated Updated Mar 29, 2024 | 4:14 PM

కోలీవుడ్ స్టార్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ గురించి అందరికి తెలిసిందే. తనదైన నటనతో.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కానీ, ఆకస్మికంగా ఆయన మరణం అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా తీరాని విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. అయితే వివేక్ మరణించిన మూడేళ్ల తర్వాత ఆయన ఇంట్లో తాజాగా శుభకార్యం జరిగింది.

కోలీవుడ్ స్టార్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ గురించి అందరికి తెలిసిందే. తనదైన నటనతో.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కానీ, ఆకస్మికంగా ఆయన మరణం అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా తీరాని విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. అయితే వివేక్ మరణించిన మూడేళ్ల తర్వాత ఆయన ఇంట్లో తాజాగా శుభకార్యం జరిగింది.

  • Published Mar 29, 2024 | 4:14 PMUpdated Mar 29, 2024 | 4:14 PM
సింపుల్‏గా  కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి.. తండ్రి జ్ఞాపకంగా ఏం చేశారంటే

కోలీవుడ్ స్టార్ కమెడియన్ దివంగత నటుడు వివేక్ గురించి అందరికి తెలిసిందే. తనదైన నటనతో.. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే పేరుకు తమిళ నటుడు అయిన వివేక్ కు.. తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. ఈయన టాలీవుడ్ లో అపరిచితుడు, రాఘువరన్ బీటెక్, శివాజీ, బాయ్స్, ఖుషీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఎంతో ఆద్భుతంగా తన నటనతో అందరి చేత నవ్వులు పూయించిన వివేక్ ఆకస్మత్తుగా 2021లో గుండెపోటుతో మృతి చెందారు. ఇక ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చారు. ఇక ప్రేక్షకులకు కావలసినంత వినోదంను అందించిన వివేక్ మరణించిన అభిమానుల మదిలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా వివేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోస్ అనేవి నెట్టింట వైరలవుతున్నాయి.

నటుడు వివేక్ మరణంతో తమిళనాట తీరని లోటు మిగిలిపోయింది. ఒక స్టార్ కమెడియన్ గా ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన ఆయన ఎప్పుడు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని గతంలో సినీ ప్రముఖులు చాలామంది అన్నారు. ఇక వివేక్ మరణం ఆయన అభిమానులకే కాకుండా.. కుటుంబ సభ్యులు కూడా ఎంతగానే కుంగిపోయేలా చేసిన విషయం తెలిసిందే. కాగా, వివేక్ పెళ్లిడుకు వచ్చిన కూతురు ఉంది. ఈ క్రమంలోనే.. తాజాగా వీవేక్ కూతురు తేజస్వీనికి భరత్ అనే వ్యక్తితో నిన్న అనగా (గురువారం మార్చి 28న) వివాహం జరిగింది. అయితే ఈ వివాహ వేడుకలు అనేవి చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్ లోని చిన్న కలైవారన్ రోడ్ లో గల వివేక్ నివాసం వద్ద జరిగింది. కాగా, ఈ వేడుకలకు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో సింపుల్‏గా నిర్వహించారు. ప్రస్తుతం తేజస్వీని పెళ్లి ఫోటస్ నెట్టింట వైరల్ గా మారాయి.

comedian-vivek-daughter-weddingకాగా, వివాహ అనంతరం తన తండ్రి వివేక్ జ్ఞాపకంగా..కుమార్తే తేజస్వి, ఆమె భర్త భరత్ మొక్కలు నాటారు. అయితే తన తండ్రి కల కోసం ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటినట్లు తేజస్విని తెలిపారు. అలాగే వివాహానికి హాజరైన అతిథులకు కూడా మొక్కలు పంపిణి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. వాటిని చూసిన అభిమానులు, నెటిజన్స్ వివేక్ ను తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే వెండితెరపై తన నటనతో ఎంతో ఆద్భుతంగా అలరించిన వివేక్.. నిజ జీవితంలో ఎంతోమందికి రోల్ మోడల్.  అలాగే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని వివేక్ లక్షలాది మొక్కలు నాటారు. అలా నిరంతరం మొక్కలు నాటుతూ ప్రకృతిని కాపాడాలంటూ.. తన అభిమానులకు కూడా పిలుపునిచ్చేవారు. కానీ.  2021లో ఆయన ఆకస్మిక మరణం   మరి, వివేక్ కూతురు వివాహంలో తండ్రి జ్ఞాపకంగా మొక్కలు పంపీణీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBankobet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel