iDreamPost
android-app
ios-app

కిస్ కిసిక్కు కిక్ ఎక్కించి.. ఊ అనిపించిందా !

  • Published Nov 25, 2024 | 5:53 PM Updated Updated Nov 25, 2024 | 5:53 PM

Pushpa 2 Updates: కొద్దీ రోజులుగా పుష్ప 2 నుంచి ఊరిస్తూ వస్తున్న స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కోసం ఓ వర్గం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. పైగా ఈ ఐటెం సాంగ్ కోసం చాలా రకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. పార్ట్ 1 లో సమంత చేసిన ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపేసిన మాట వాస్తవం.ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చేసింది.

Pushpa 2 Updates: కొద్దీ రోజులుగా పుష్ప 2 నుంచి ఊరిస్తూ వస్తున్న స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కోసం ఓ వర్గం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. పైగా ఈ ఐటెం సాంగ్ కోసం చాలా రకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. పార్ట్ 1 లో సమంత చేసిన ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపేసిన మాట వాస్తవం.ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చేసింది.

  • Published Nov 25, 2024 | 5:53 PMUpdated Nov 25, 2024 | 5:53 PM
కిస్ కిసిక్కు కిక్ ఎక్కించి.. ఊ అనిపించిందా !

కొద్దీ రోజులుగా పుష్ప 2 నుంచి ఊరిస్తూ వస్తున్న స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కోసం ఓ వర్గం ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. పైగా ఈ ఐటెం సాంగ్ కోసం చాలా రకాల డిస్కషన్స్ కూడా జరిగాయి. పార్ట్ 1 లో సమంత చేసిన ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపేసిన మాట వాస్తవం. ఇంటా, బయట,సోషల్ మీడియా రీల్స్ , వీడియోస్ తో రచ్చ రచ్చ చేసింది. దీనితో పార్ట్ 2 మీద చాలానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ సాంగ్ లో చంద్రబోస్ రాసిన సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచింది. ప్రేమైన ఏదైనా సరే అమ్మాయికి ఇష్టమైతేనే అనే రీతిలో ఆ సాంగ్ ను కంపోజ్ చేశారు. ఇక ఇప్పుడు శ్రీలీల వంతు వచ్చేసింది.

ఫోటోలు దించుకోండి కానీ నాది మాత్రం జాగ్రత్త లేదంటే దెబ్బలు పడతాయి.. అంటూ వచ్చింది ఈ సాంగ్. అయితే మొదట ఈ కిస్సిక్ సాంగ్ కు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది.  చూస్తుంటే ఈసారి చంద్రబోస్ కాస్త వెరైటీ ప్రయోగం చేశారనిపిస్తుంది. ఇంకా ఈ పాటను జాగ్రత్తగా గమనిస్తే ఓ మంచి మెసేజ్ కూడా ఉందనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ , ట్యూన్, బీట్స్ అన్ని అల్టిమేట్ అనిపించుకునేలా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సాంగ్ స్టార్ట్ చేయడానికి కాస్త టైం తీసుకున్నరు కానీ.. ఈ కిస్సిక్ సాంగ్ స్లో పాయిజన్ ల ఆడియన్స్ కు ఎక్కేలా ఉంది. దేవి సాంగ్స్ అన్ని కూడా రోజులు గడిచే కొద్దీ రీచ్ పెంచుకుంటూ ఉంటాయి. మొదట విన్నప్పుడు అదిరిపోయింది అనే టాక్ రాకపోయినా.. క్రమంగా ఆడియన్స్ కు ఎక్కేసి ఛార్జ్ బస్టర్ కొట్టేస్తాయి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ సాంగ్ గురించి మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎలాంటి సాంగ్ కైనా సహజమే. ఇక కిస్ కిసుక్కు ఇచ్చిన కిక్ ఆడియన్స్ ను ఊ అనిపిస్తుందా ఊహూ అనిపిస్తుందా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

పైగా ఇది కేవలం లిరికల్ సాంగ్ మాత్రమే. అక్కడక్కడ బన్నీ , శ్రీలీల వేసిన స్టెప్స్ చూపించారు. కానీ అది పూర్తి స్థాయిలో లేదు. సో బిగ్ స్క్రీన్ మీద బన్నీ , శ్రీలీల స్టెప్పులు చూశాక కానీ ఓ క్లారిటీకి రాలేము. మరో వైపు రీసెంట్ గా జరిగిన ఈవెంట్ తో సినిమా పై అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. కానీ సుకుమార్ మాత్రం కాస్త టెన్షన్ పెట్టిస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ జరుగుతునే ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. పార్ట్ 1 రిలీజ్ టైం లోను ఇదే జరిగింది. లాస్ట్ మినిట్ లో అందరిని టెన్షన్ పెట్టించాడు లెక్కలు మాస్టారు. కానీ రిజల్ట్ మాత్రం బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయింది. సో ఈసారి కూడా అది వర్క్ అవుట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet