Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం మారాడు! ఇక మారాల్సింది దుర్మార్గమైన ట్రోలర్స్ మాత్రమే!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమ సత్తా చూపించుకోడానికి ఎంతో మంది నటి నటులు వస్తూ ఉంటారు. అయితే వారిలో తమ కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి.. హిట్స్ కొడుతున్న వారు మాత్రమే కొంతమందే ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమ సత్తా చూపించుకోడానికి ఎంతో మంది నటి నటులు వస్తూ ఉంటారు. అయితే వారిలో తమ కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి.. హిట్స్ కొడుతున్న వారు మాత్రమే కొంతమందే ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు.

ఇండస్ట్రీ లో నెగ్గుగురవాలంటే.. కేవలం టాలెంట్ , కష్టం ఉంటే మాత్రమే సరిపోదు.. దానితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా కేవలం కొంతమంది హీరోలు , హీరోయిన్స్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఎంతో మంది నటి నటులు తమ సత్తా ఏంటో చూపించడానికి.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వచ్చినా ప్రతి ఒక్కరు స్టార్ కాలేరు.. తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వదన్న సంగతి అందరికి తెలిసిందే. ఎంత వారిలో టాలెంట్ ఉన్నా సరే.. కాస్త అదృష్టం కూడా కలిసిరావాల్సిందే. అలా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చిన హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం. ఇక తీసిన సినిమా హిట్ అయితే ప్రశంసలు ఎలా వస్తాయో.. ప్లాప్ అయితే విమర్శలు కూడా అలానే వస్తాయి. కానీ వీటికి సమాధానం చెప్పేలా కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

రాజా వారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం.. ఆ సినిమా దాదాపు ప్రతి ఒక్కరి ఫేవరేట్ మూవీస్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో అతను మంచి పేరే సంపాదించుకున్నాడు. కానీ వచ్చిన ఆ క్రేజ్ ఎంతో కాలం నిలబడలేదు. ఈ రెండు సినిమాల తర్వాత కిరణ్ కెరీర్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. వచ్చిన ఆఫర్ ను వచ్చినట్లు అందిపుచ్చుకున్నా కూడా.. ఆ సినిమాలు మాత్రం కిరణ్ కు ట్రోలింగ్స్ నే మిగిల్చాయి. ఓ సినిమా హిట్ అయినప్పుడు ప్రశంసించే ప్రేక్షకులే.. ఓ సినిమా ప్లాప్ అయినప్పుడు అంతకంటే దారుణంగా విమర్శలు కురిపిస్తారన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా డార్క్ కామెడీ పేరుతో యుట్యూబర్ ప్రణిత్ హనుమంతు విచ్చల విడిగా.. చేసిన కామెంట్స్ గురించి చెప్పక్కర్లేదు . ఎంతో మంది ఇలాంటి ట్రోలింగ్స్ కు గురవుతూనే ఉన్నారు. కిరణ్ అబ్బవరం విషయంలోను అదే జరిగింది. దీనితో ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం తనపై వచ్చిన ట్రోలింగ్స్ కు చెక్ పెట్టి వారికి సరైన సమాధానం ఇవ్వడం కోసం సొంతంగా తానే ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీ లో కిరణ్ పేరు వినిపించబోతుంది. కిరణ్ అబ్బవరం మారాడు. ఇక మారాల్సింది దుర్మార్గమైన ట్రోలర్స్ మాత్రమే.

కిరణ్ అబ్బవరం తీసిన సినిమాలు ప్లాప్ కావడంతో.. కొంతకాలం అతను ఇండస్ట్రీకి దూరం అయినా మాట వాస్తవమే. అతని కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. ఇక కిరణ్ అబ్బవరం మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులను అతను గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా తాజాగా తన కొత్త మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ కు సంబందించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఇక ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. ఈ మూవీని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి.. స్వయంగా కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను జులై 9 అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికి విడుదల చేసిన పోస్టర్ ను గమనిస్తే ఇదొక పీరియాడిక్ మూవీ అని అర్ధమౌతుంది . మరి ఈ సినిమా అయినా కిరణ్ కు మంచి కమ్ బ్యాక్ ఇస్తుందేమో వేచి చూడాలి. మరి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments