అందుకే కిరణ్ అబ్బవరం రియల్ హీరో.. స్పెషల్ స్టోరీ..!

Kiran Abbavaram: ఒక్కసారి సినిమా ప్రపంచంలోకి దిగారంటే అందరికి ఇదొక వ్యసనంలా మారిపోతుంది. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తనపై వచ్చే ట్రోలింగ్స్ కు చెక్ పెట్టాడు. రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Kiran Abbavaram: ఒక్కసారి సినిమా ప్రపంచంలోకి దిగారంటే అందరికి ఇదొక వ్యసనంలా మారిపోతుంది. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తనపై వచ్చే ట్రోలింగ్స్ కు చెక్ పెట్టాడు. రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

సాధారణంగా రంగుల ప్రపంచంలో ట్రోలింగ్స్ సర్వ సాధారణం. మీడియా , సోషల్ మీడియాలో సినిమా వాళ్ళ గురించి విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అవి బాగా వైరల్ అవుతాయి కూడా. కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుందిగా.. అలాగే దీనికి ఉండాలి. అలా కాదని లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం.. కిరణ్ అబ్బవరం లాంటి వారు ట్రోలర్స్ నోర్లు మూయించడానికే రెడీ గా ఉన్నారు. నిజమే కదా మరీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. రాజావారు రాణి వారు తో స్టార్ట్ అయినా అబ్బవరం జర్నీ కసితో ‘క’ మూవీ వరకు వచ్చింది. ఈ మధ్యలో ఈ హీరో మీద ఎన్నో ట్రోల్ల్స్ , ఎన్నో మీమ్స్ .. అయినా సరే కిరణ్ అబ్బవరం ఎక్కడా తగ్గలేదు. తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందన్న గ్యారెంటీ ఏ హీరోకు లేదు. ఒక హీరోగా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే.. సినిమా హిట్ కొట్టినా .. బోల్తా పడినా ఇంకో సినిమా తీయాల్సిందే. కాకపోతే కొంతమందికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి.. ఫెయిల్ అయినా త్వరగా కమ్ బ్యాక్ ఇస్తారు. మరికొంతమందికి ఆలస్యం అవుతుంది. కిరణ్ విషయంలోనూ ఇదే జరిగింది.

ఇండస్ట్రీలో నెగ్గుగురావడం అంత చిన్న విషయం కాదు.. అయితే వందల కోట్ల ఆస్తులైన ఉండాలి. లేదా బలమైన సినీ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి. ఈ రెండు లేకుండా వారు ఇండస్ట్రీలో మంచి బజ్ తో ఫార్మ్ లో ఉన్నారంటే మాత్రం.. దాని వెనుక వారు పడిన కష్టం , అవమానాలు , ట్రోలింగ్స్ , ఫెయిల్యూర్స్ ఇవి మాత్రమే ఉంటాయి. కిరణ్ అబ్బవరం కూడా ఈ కోవకు చెందిన వాడే. ఇలాంటి హీరోలు ఒక మంచి సినిమా తీసినా కానీ.. ప్రేక్షకులు వారిపై ఎక్కడలేని అభిమానం చూపిస్తూ ఉంటారు. అలాగే సినిమా ఫెయిల్ అయితే అదే ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ కిరణ్ అబ్బవరం విషయంలో మాత్రం.. తన సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత.. చాలా వరకు ట్రోల్స్ ఏ ఎదురయ్యాయి. కిరణ్ కు కథల ఎంపిక రాదనీ.. అసలు హీరో మెటీరియల్ ఏ కాదని..అలాంటి ఎన్నో దారుణమైన విమర్శలు ఎదురుకున్నాడు. ఎవరైనా వాటిని ఎంత కాలం భరిస్తారు.. చూసి చూసి ఇంకా ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ ఓపెన్ అయ్యాడు. ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఒక్క స్పీచ్ తో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

ఈ స్పీచ్ తో తన ఎమోషన్ ను బయటపెట్టి.. ఆడియన్స్ ను కూడా ఎమోషనల్ అయ్యేలా చేశాడు. కిరణ్ చెప్పిన దానిలో వాస్తవం లేకపోలేదు. ఎదిగే హక్కు అందరికి ఉంటుంది. ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా.. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వారిని కావాలని ట్రోల్ చేయడం సరైనది కాదు. అందులోను ఇలా కష్టపడి ఇండస్ట్రీ లో ఎదిగేవారిని ట్రోల్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇక ప్లాప్స్ తర్వాత ఈ హీరో కాస్త గ్యాప్ తీసుకున్నాడు.  సరైన కథల కోసం చూశాడు. ఇప్పుడు అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘క’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ట్రైలర్ చూసి చెప్పేయొచ్చు..సో కిరణ్ అబ్బవరం మారాడు.. ఇక మారాల్సింది ట్రోలర్స్ మాత్రమే. క సినిమా రిలీజ్ తర్వాత కిరణ్ హిట్ కొడతాడా లేదా అనే మ్యాటర్ పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు కిరణ్ కు పెరిగిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు. ఇకపై కిరణ్ నుంచి రాబోయే సినిమాలకు కూడా వారి సపోర్ట్ ఉంటుందన్న నమ్మకాన్ని ఇస్తున్నారు. మరి ఈ హీరో విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments