థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ‘క’ ట్రైలర్.. దీపావళికి ఇదే 10K వాలా

Ka Movie Updates : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్ ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ట్రైలర్ లో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గమనించారా.

Ka Movie Updates : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్ ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ట్రైలర్ లో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గమనించారా.

ఎంతో మంది నటీ నటులు తమ సత్తా ఏంటో చూపించడానికి.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్ కాలేరు.. తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వదన్న సంగతి అందరికి తెలిసిందే. ఎంత వారిలో టాలెంట్ ఉన్నా సరే.. కాస్త అదృష్టం కూడా కలిసిరావాల్సిందే. అలా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చిన హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం. రాజా వారు రాణి గారు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఓకె అనిపించుకున్నాడు. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వలన హిట్స్ కంటే కూడా ఎక్కువగా ప్లాపులను చూసాడు. దీనితో కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘క’.

ఇలా ఒకటే అక్షరాన్ని టైటిల్ గా పెట్టుకున్న మూవీస్ గత కొన్నేళ్లుగా ఏమి లేవు. సో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు కాస్త యూనిక్ గా అనిపించింది. పైగా సొంత నిర్మాణం.. ఇలా ఏ రకంగా చూసినా కానీ ఈ సినిమా కిరణ్ కెరీర్ లో ఓ వెరైటీ ప్రయోగం అని చెప్పి తీరాలి. కథ పై నమ్మకంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీపడలేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ పై వస్తున్న టాక్ చూస్తుంటే మాత్రం.. ఖచ్చితంగా ఈ మూవీ దీపావళికి గట్టిగా సౌండ్ చేయబోతోందని తెలుస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉన్నా సరే.. కథపై ఉన్న నమ్మకంతో చాలా ధీమాగా కాంపిటీషన్ కు రెడీ అవుతుంది ‘క’ .

ఇక ట్రైలర్ ను గమనించినట్లయితే.. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ లో చాలా డిఫరెన్స్ కనిపించింది. ఎలా అయినా సరే ఈసారి హిట్ కొట్టాలన్నా కసితోనే.. యాక్టింగ్ చేశాడా అనే రేంజ్ లో ఉంది. అలాగే సినిమాకు మ్యూజిక్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. దీనితో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను యూనిక్ గా చూపించబోతున్నారనిపిస్తుంది. విరూపాక్ష , మంగళవారం మూవీస్ లానే ప్రేక్షకులను థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ను ప్రెసెంట్ చేయబోతున్నారు. దర్శకుడు సుజిత్ , సందీప్ చెప్పిన కథ కచ్చితంగా ట్రెండ్ కు తగినట్లే ఉందని అనిపిస్తుంది. ఇప్పుడున్న పోటీలో నెగ్గుకురావాలంటే ఇలాంటి కథలు కచ్చితంగా ఎంచుకోవాల్సిందే. ఇలాంటి ఓ కథను ఎంచుకుని కిరణ్ అబ్బవరం సరైన నిర్ణయం తీసుకున్నాడనిపిస్తుంది. మరి థియేటర్ లో బొమ్మ పడితే కానీ అసలు మ్యాటర్ ఏంటనేది తెలియదు. ఒకవేళ సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా దీపావళి కి పేలబోయే 10కె వాలా ‘క’ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments