iDreamPost
android-app
ios-app

ఇంకా అలాంటి పనులు ఆపేయలేదా? విష్ణు ప్రియ పరువుతీసిన శ్రీముఖి!

  • Published Jul 10, 2024 | 3:55 PM Updated Updated Jul 10, 2024 | 3:55 PM

బుల్లితెరపై ఎంటర్ టైన్ చేస్తోన్న మరో షో కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్. ఇటీవల స్టార్టైన ఈ షో ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత యాంకర్ కమ్ నటి విష్ణు ప్రియ బుల్లితెరపై సందడి చేస్తుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఇందులో

బుల్లితెరపై ఎంటర్ టైన్ చేస్తోన్న మరో షో కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్. ఇటీవల స్టార్టైన ఈ షో ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత యాంకర్ కమ్ నటి విష్ణు ప్రియ బుల్లితెరపై సందడి చేస్తుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఇందులో

  • Published Jul 10, 2024 | 3:55 PMUpdated Jul 10, 2024 | 3:55 PM
ఇంకా అలాంటి పనులు ఆపేయలేదా? విష్ణు ప్రియ పరువుతీసిన శ్రీముఖి!

బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు కొదవ లేదు. కామెడీ షో, డ్యాన్స్ షోలతో పాటు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసేందుకు ప్రత్యేకమైన గేమ్ షోలను డిజైన్ చేస్తున్నాయి ఆయా టీవీ సంస్థలు. కాగా, తాజాగా స్టార్ మా వేదికగా న్యూ ఐకానిక్ గేమ్ షో అంటూ కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ అంటూ తీసుకువచ్చారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ వచ్చింది.  డ్యాన్స్ మాస్టర్ శేఖర్, టీవీ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. జూన్ 29 నుండి శని, ఆదివారాల్లో ప్రసారం అవుతుంది ఈ సరికొత్త ధారావాహిక. ఇదిలా ఉంటే.. తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగానే.. షోపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. శేఖర్ మాస్టర్, అనసూయ మధ్య జరిగిన ఫన్సీ ఫైట్ అందరినీ ఆకర్షించింది.

ప్రతి వారం.. సరికొత్త ధీమ్‌తో అలరిస్తోంది ఈ షో. ఈ షోకు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఇందులో విష్ణు ప్రియ, సౌమ్య రావు, ప్రియాంక జైన్, శోభాశెట్టి, రీతూ చౌదరి పల్లవి గౌడ, ఆయేషా ఖాన్, ప్రేరణ, గోమతి, దీపికతో పాటు అంబటి అర్జున్, అమర్ దీప్ చౌదరీ, రవితేజ, శ్రీకర్, టేస్టీ తేజ, యాదమ రాజు, నిఖిల్, గౌతమ్, కిరణ్‌లు కంటెస్టెంట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇందులో అయితే తాజాగా వచ్చే ఎపిసోడ్లకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సారి విలేజ్ థీమ్‌తో రాబోతుంది. అధికారం కోసం అంటూ కిరాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ ఫైట్ స్టార్ అయ్యింది. అయితే ఇందులో విష్ణు ప్రియ తన టీంతో కలిసి ఎంట్రీ ఇవ్వగానే.. శ్రీముఖి.. విష్ణుప్రియ దగ్గరకు వెళ్లి ‘ఏంటమ్మా నువ్వు ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు ఆపలేదా’అంటూ పురువు తీసేసింది.

VishnuPriya

అలాగే ఏదో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించింది విష్ణుప్రియ. కాగా, విష్ణు ప్రియ చాలా గ్యాప్ తర్వాత బుల్లితెరపై ఈ షోతో సందడి చేస్తుంది. తన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇందులో ఓ గేమ్ సందర్భంగా కంటెస్టెంట్స్ పల్లవి గౌడ, శ్రీకర్ మధ్య గొడవ జరుగుతుంది. అంతలో శ్రీకర్ ఆవేశంగా లేచి.. అనసూయ గారు జడ్జిమెంట్ ఇవ్వండని అడగ్గానే.. మైండ్ యువర్ బిజినెస్ అంటూ ఫైర్ అయ్యింది అనసూయ. నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను అనగానే.. ఇది రిక్వెస్ట్‌లా లేదు.. నన్ను క్వశ్చన్ ఎందుకు వేస్తున్నావు.. నీకు అడిగే అర్హత లేదంటూ ఆగ్రహం చూపించింది. అసలేమనిందో తెలియాలంటే ఈ వీక్ ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ