iDreamPost
android-app
ios-app

‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మూవీ విలన్ మంజు గురించి మీకు తెలియని నిజాలు!

  • Published Oct 02, 2023 | 3:25 PM Updated Updated Oct 02, 2023 | 3:27 PM
  • Published Oct 02, 2023 | 3:25 PMUpdated Oct 02, 2023 | 3:27 PM
‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మూవీ విలన్ మంజు గురించి మీకు తెలియని నిజాలు!

‘కింగ్‌ ఆఫ్‌ కోత’.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త కథ కావటంతో ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలైన ప్రతీ చోట పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక, ఈ సినిమాలో నటించిన ప్రతీ క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే విలన్‌ దగ్గర ఉండే లేడీ విలన్‌ ‘మంజు’ పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఆ లేడీ విలన్‌ గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.

నెటిజన్లు ఆమె వివరాలు తెలుసుకోవటం కోసం ఇంటర్‌ నెట్‌లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. నెటిజన్లు అంతగా సెర్చ్‌ చేస్తున్న కింగ్‌ ఆఫ్‌ కోత మంజు అసలు పేరు ‘ నైలా ఉష’. ఆమె కేరళలోని త్రివేండ్రంలో జన్మించారు. 2004లో చదువు పూర్తయిన తర్వాత ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయారు. అక్కడ హిట్‌ 96.7 రేడియో స్టేసన్‌లో జాకీగా పనిచేయటం మొదలుపెట్టారు. 2007లో రోనా రాజన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత 2013లో ‘ కుంజునాథంటే కథ’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమాలో మమ్ముట్టి సరసన నటించారు. తర్వాతినుంచి మలయాళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ వస్తున్నారు. మలయాళంలోని అందరు స్టార్‌ హీరోలతో కలిసి పని చేశారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాదు.. టీవీ షోలకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించారు. 2021లో వచ్చిన ‘‘కలర్స్‌ ఫుడ్‌ ట్రయిల్‌’’తో పాటు దాదాపు ఐదు షోలకు వ్యాఖ్యతగా వ్యహరించారు. మరి, కింగ్‌ ఆఫ్‌ కోత సినిమాలో విలనిజం పండించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘నైలా ఉష’పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş