iDreamPost
android-app
ios-app

‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్! ఏళ్లు గడిచినా తోక ఊపే కుక్కలాంటిదే ఈ కోథా.. దుల్కర్ మాస్!

  • Author ajaykrishna Updated - 01:35 PM, Thu - 10 August 23
  • Author ajaykrishna Updated - 01:35 PM, Thu - 10 August 23
‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్! ఏళ్లు గడిచినా తోక ఊపే కుక్కలాంటిదే ఈ కోథా.. దుల్కర్ మాస్!

ఏ భాషలో సినిమాలను అదే భాషలో చేస్తూ.. నటుడిగా తనకంటూ ఓ యూనిక్ ఫేమ్ సంపాదించుకున్నాడు మలయాళం యంగ్ స్టర్ దుల్కర్ సల్మాన్. ఓవైపు మలయాళం, తమిళ, కన్నడ భాషలలో సినిమాలు చేస్తూనే.. తెలుగులో మహానటి, సీతారామం లాంటి క్లాసిక్ సినిమాలు చేసి మెప్పించాడు. తెలుగులోను దుల్కర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఆ మధ్య బాలీవుడ్ లో కూడా స్ట్రెయిట్ ఫిల్మ్ చేసి.. నార్త్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అయితే.. సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. దుల్కర్ నుండి చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీగా ఈ సినిమాని అభిలాష్ జోషి తెరకెక్కించారు. ఆగష్టులోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషలలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ ఆగష్టు నెలలోనే అని మెన్షన్ చేశారు కానీ.. డేట్ రివీల్ చేయలేదు. ఓనం ఫెస్టివల్ సందర్బంగా సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓవైపు స్టోరీని నేరెట్ చేస్తూనే.. మాస్ యాక్షన్ సన్నివేశాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ట్రైలర్ బట్టి.. ఈ సినిమా ‘కోథ’ అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. ఇందులో రాజు అనే క్యారెక్టర్ లో దుల్కర్ కనిపించనున్నాడు. అయితే.. రాజు కూడా చిన్నప్పటి నుండి వాళ్ల నాన్నలాగా డాన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

అలా కోథాకి కింగ్ అవ్వాలనే ప్రయత్నంలో రాజు జర్నీ ఎలా సాగింది అనేది ఈ సినిమా కథ. అయితే.. ఇందులో ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉంది. ఎన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చినా.. సొంత యజమానిని చూసిన కుక్కలాంటిది ఈ కోథా. ముందు అరుస్తుంది. తర్వాత తోక ఊపుకుంటూ వస్తుంది. ఆ తర్వాత కాళ్ల దగ్గర పడి ఉంటుంది’’ అనే డైలాగ్‌‌ తో పాటు విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. వేరే ఎవడి కంట్రోల్ లోనో ఉన్న కోథాని.. ఆవారాగా పెరిగిన రాజు ఎలా దాన్ని దక్కించుకున్నాడు? కోథాని ఎలా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు? అనేది స్టోరీగా తెలుస్తుంది. ఇక జేక్స్ బిజాయ్ మ్యూజిక్.. నిమిష్ రవి విజువల్స్.. అభిలాష్ జోషి నేరేషన్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాని వేఫరెర్‌ ఫిలిమ్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. మరి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా.. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. మరి కింగ్ ఆఫ్ కోథా ట్రైలర్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio