iDreamPost
android-app
ios-app

స్టార్‌ హీరో గొప్ప మనసు.. ఆస్పత్రి బెడ్‌ మీద ఉ‍న్న చిన్నారి కోసం..

స్టార్‌ హీరో గొప్ప మనసు.. ఆస్పత్రి బెడ్‌ మీద ఉ‍న్న చిన్నారి కోసం..

సినిమా వాళ్లను దేవుళ్లుగా కొలిచే దేశం ఇది. ఇక్కడ రాజకీయాల తర్వాత దేశాన్ని ప్రభావితం చేసే అంశం సినిమానే. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి చరిత్రలు సృష్టించిన రోజులు కూడా ఉన్నాయి. అంతలా సినిమా అన్నది ప్రజల మీద ప్రభావం చూపుతోంది. ఇక, స్టార్‌ హీరోల కోసం వారి ఫ్యాన్స్‌ ప్రాణాలు కూడా ఇచ్చేయటానికి సిద్ధంగా ఉంటారు. తమ అభిమాన హీరోను ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. తమను అంతలా అభిమానించే వారి విషయంలో కొంతమంది స్టార్‌ హీరోలు కూడా ఎంతో ప్రేమగా ఉంటారు.

అభిమానులకు కష్టం ఉందని తెలిసినపుడు సహాయం చేస్తున్న స్టార్‌ హీరోలు ఈ దేశంలో చాలా మందే ఉన్నారు. అలాగే అభిమానుల ఆఖరి కోర్కెలు తీర్చిన వారు కూడా ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. చావు బతుకుల మధ్య ఆస్పత్రి బెడ్‌పై ఉన్న కొంతమంది.. తమ అభిమాన హీరోను చూడాలని కోరుకోవటం.. సదరు స్టార్‌ హీరోలు వారి కోర్కెను తీర్చటం వంటి సంఘటనలు చాలానే జరిగాయి. తాజాగా, ప్రముఖ కన్నడ స్టార్‌ హీరో కిచ్చ సుదీప్‌ తన అభిమాని కోర్కెను తీర్చాడు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడ్ని నేరుగా ఆస్పత్రికి వెళ్లి కలిశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన సాక్షి అనే చిన్నారి క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారికి కిచ్చ సుదీప్‌ అంటే ఎంతో ఇష్టం. ఆ చిన్నారి సుదీప్‌ను చూడాలని ఉందని ఆస్పత్రి వైద్యులకు చెబుతూ ఉండేది. ఈ విషయం కాస్తా సుదీప్‌కు చేరింది. దీంతో ఆయన సాక్షిని కలవటానికి ఆస్పత్రికి వెళ్లారు. పాపతో కొన్ని నిమిషాల పాటు మాట్లాడారు. ఆమెతో ఫొటోలు దిగి, ఆటో గ్రాఫ్‌ ఇచ్చి అక్కడినుంచి వచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/