iDreamPost
android-app
ios-app

ఖైదీ 2.. అంచనాలు తగ్గకుండా ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు!

  • Author ajaykrishna Updated - 11:56 AM, Fri - 3 November 23

ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీ సిరీస్ ఏదంటే.. టాప్ లో LCU కూడా ఉంటుంది. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్.. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరేట్ అయిపోయింది. LCU అనగానే అందరికీ ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో సినిమాలు గుర్తొస్తాయి.

ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీ సిరీస్ ఏదంటే.. టాప్ లో LCU కూడా ఉంటుంది. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్.. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరేట్ అయిపోయింది. LCU అనగానే అందరికీ ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో సినిమాలు గుర్తొస్తాయి.

  • Author ajaykrishna Updated - 11:56 AM, Fri - 3 November 23
ఖైదీ 2.. అంచనాలు తగ్గకుండా ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు!

ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీ సిరీస్ ఏదంటే.. టాప్ లో LCU కూడా ఉంటుంది. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్.. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరేట్ అయిపోయింది. LCU అనగానే అందరికీ ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో సినిమాలు గుర్తొస్తాయి. అందులో క్యారెక్టర్స్ పరంగా ముందుగా డిల్లీ.. ఆ తర్వాత సంతానం.. విక్రమ్.. రోలెక్స్.. లియో ఇలా వరుసగా మైండ్ లో వెలుగుతాయి. అయితే.. ఈ LCU మొత్తానికి నాంది వేసింది ఖైదీ. ఆ సినిమాలో హీరో కార్తీ పోషించిన డిల్లీ క్యారెక్టర్. అవును.. ఒక నైట్ లో జరిగే ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని లోకేష్ కనగరాజ్.. ఖైదీని తీసిన తీరు అద్భుతం.

కట్ చేస్తే.. ఖైదీకి కొనసాగింపు ఉందని క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఎప్పుడెప్పుడు ఖైదీ 2 వస్తుందా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఖైదీ విడుదలై నాలుగేళ్లు అవుతోంది. ఆ తర్వాత లోకేష్.. మాస్టర్, విక్రమ్, లియో సినిమాలు తీశాడు. వీటిలో మాస్టర్ పక్కన పెడితే.. విక్రమ్, లియో సినిమాలను LCU కి లింక్ చేశాడు. అంటే.. రోజురోజుకి LCU విస్తరిస్తోంది. కోలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా ఇందులో చేరుతున్నారు. కాగా.. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్, సూర్య, ఫాహద్ ఫాజిల్ ఎంటర్ అయ్యారు. అంతకుముందు సంతానం క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి.. బిజాయ్ గా నరేన్.. చాలామంది స్టార్స్ ఉన్నారు. కానీ.. LCU లో ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా డిల్లీ క్రేజ్ వేరు.

తాజాగా ఖైదీ విడుదలై నాలుగేళ్లు కావడంతో ఆ సినిమాని నిర్మించిన నిర్మాతలు.. ఖైదీ 2 గురించి సాలిడ్ అప్డేట్ అందించారు. అదేంటంటే.. LCU నుండి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఖైదీ 2. ఇది ఆల్రెడీ లోకేష్ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ తో లోకేష్ ఓ సినిమా ఓకే చేశాడు. అది అయిపోయాక ఖైదీ 2 పై కూర్చోబోటున్నాడు. అయితే.. LCU లో విక్రమ్, రోలెక్స్, లియో క్యారెక్టర్స్ ఉన్నా.. అసలు డిల్లీ పదేళ్లు జైలుకు ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో నెలకొంది. విక్రమ్ లో, లియోలో డిల్లీ గురించి ప్రస్తావన వచ్చింది. అంటే.. విక్రమ్, లియోలకు డిల్లీతో ఖచ్చితంగా ఏదైనా క్లాష్ లేదా ఫ్రెండ్ షిప్ ఉండి ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు. మరి డిల్లీ మళ్ళీ వస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఖైదీ 2 ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఖైదీ 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

ఇదీ చదవండి: ఇటు రికార్డులు.. అటు తప్పిన లెక్కలు.. నిజమేంటి లియో?

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş