iDreamPost
android-app
ios-app

KGF నిర్మాతల క్రేజీ కాంబినేషన్

  • Published Apr 21, 2022 | 12:59 PM Updated Updated Apr 21, 2022 | 12:59 PM
  • Published Apr 21, 2022 | 12:59 PMUpdated Apr 21, 2022 | 12:59 PM
KGF నిర్మాతల క్రేజీ కాంబినేషన్

కెజిఎఫ్ రెండు భాగాలూ సూపర్ బ్లాక్ బస్టర్ కావడంతో హోంబాలే ఫిలిమ్స్ కేవలం కన్నడ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు తమిళం వైపు కూడా దృష్టి సారిస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ తో సలార్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద షూటింగ్ టైంలోనే ఓ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీలే దర్శకుడు కావడంతో గ్రాండియర్ నెస్ ఇంకా పెరిగిందని ఇన్ సైడ్ టాక్. ఏదైతేనేం రాజ్ కుమార్ లాంటి దిగ్గజాల వల్ల కానిది హోంబాలే చేసి చూపించింది. శాండల్ వుడ్ ఇకపై చిన్న మార్కెట్ కాదనే విషయాన్ని కెజిఎఫ్ రూపంలో స్పష్టంగా చెప్పింది.

ఇక అసలు టాపిక్ కు వస్తే ఇవాళ తమ నెక్స్ట్ ప్రాజెక్టుని ఈ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సుధా కొంగర దర్శకత్వంలో ట్రూ స్టోరీస్ ని బేస్ చేసుకుని ఒక పవర్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తీయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. హీరో పేరు బయటికి చెప్పలేదు కానీ అది సూర్యనే అని ఎప్పుడో లీకయ్యింది. ఆకాశం నీ హద్దురాతో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించిన సుధా కొంగర ఇప్పుడీ స్క్రిప్ట్ కోసం రెండేళ్లకు పైగా వర్క్ చేశారు. ఆ మధ్య విజయ్ తో ఉండొచ్చన్నారు కానీ ఫైనల్ గా సూర్య వైపే మొగ్గు చూపారట. ఎలాగూ వర్క్ చేసిన కాంబినేషనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బడ్జెట్ కూడా ఏ మాత్రం రాజీ లేకుండా భారీగా ఉండబోతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş