iDreamPost
android-app
ios-app

ఆయన్ని నేరుగా చూడగానే మాటలు రాలేదు: శ్రీనిధి శెట్టి

  • Published Nov 05, 2023 | 3:35 PM Updated Updated Nov 05, 2023 | 3:35 PM

శ్రీనిధి మాట్లాడుతూ.. తాను చాలా వేగంగా మాట్లాడతానని, కొన్ని కొన్ని పదాలు మిగేస్తానని అన్నారు. ఒకానొక సమమయంలో కొన్ని పదాలు తప్పుగా ఉచ్చరించేదాన్నని తెలిపారు.

శ్రీనిధి మాట్లాడుతూ.. తాను చాలా వేగంగా మాట్లాడతానని, కొన్ని కొన్ని పదాలు మిగేస్తానని అన్నారు. ఒకానొక సమమయంలో కొన్ని పదాలు తప్పుగా ఉచ్చరించేదాన్నని తెలిపారు.

  • Published Nov 05, 2023 | 3:35 PMUpdated Nov 05, 2023 | 3:35 PM
ఆయన్ని నేరుగా చూడగానే మాటలు రాలేదు: శ్రీనిధి శెట్టి

రంగం ఏదైనా కావచ్చు.. సక్సెస్‌ రావటం అంటే సాధారణ విషయం కాదు. కష్టనష్టాలు, అవమానాలు అన్నిటిని ఎదుర్కోవల్సి వస్తుంది. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లినపుడే సక్సెస్‌ సాధించగలం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే కేజీఎఫ్‌ చిత్రాల హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అన్నిటిని మౌనంగా భరించి సక్సెస్‌తో వారికి సమాధానం చెప్పారు. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లోకి రావటానికి ముందు ఎదుర్కొన్న కష్టనష్టాల గురించి చెప్పుకొచ్చారు.

శ్రీనిధి మాట్లాడుతూ.. తాను చాలా వేగంగా మాట్లాడతానని, కొన్ని కొన్ని పదాలు మిగేస్తానని అన్నారు. ఒకానొక సమమయంలో కొన్ని పదాలు తప్పుగా ఉచ్చరించేదాన్నని తెలిపారు. ఆ కారణంతో చాలా మంది తనను ఎగతాళి చేసేవారని అన్నారు. మోడలింగ్‌ కోసం ముంబైలోకి అడుగుపెట్టిన తర్వాత తోటి వారు విమర్శించేవారని వెల్లడించారు. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని ఉచ్ఛారణను మెరుగుపర్చుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాతి నుంచి పొగడ్తలను, విమర్శలను సమానంగా స్వీకరిస్తూ వస్తున్నానని వెల్లడించారు.

తనకు యశ్‌ అంటే చాలా ఇష్టమని, కేజీఎఫ్‌లో ఆయనే హీరో అని తెలిసి సంతోషించినట్లు తెలిపారు. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవటానికి చాలా ఎదురు చూశానని చెప్పారు. యశ్‌ను కలవగానే నోట్లో మాటలు రాలేదని అన్నారు. యశ్‌ ఓ జెంటిల్‌మ్యాన్‌ అని అన్నారు. కాగా, శ్రీనిధి శెట్టి ప్రస్తుతం అవకాశాలు సరిగా లేవు. కేజీఎఫ్‌ సినిమాల తర్వాత ఆమె ఒకే ఒక్క సినిమా చేశారు. విక్రమ్‌తో కలిసి కోబ్రా సినిమాలో నటించారు. తర్వాత ఏ సినిమాలోనూ ఆమె కనిపించలేదు. మరి, శ్రీనిధి సినిమా జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş