iDreamPost
android-app
ios-app

ఆ తెలుగు హీరో కారణంగా KGF బ్యూటీకి గుడ్ టైమ్!

  • Published Jul 11, 2024 | 4:49 PM Updated Updated Jul 11, 2024 | 4:49 PM

ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన చిత్రం కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2. ఈ సినిమాలు చందన సీమ స్టామినాను నిరూపించాయి. ఇందులో తన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. తొలి సినిమా రిలీజ్ కాకుండానే.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన చిత్రం కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2. ఈ సినిమాలు చందన సీమ స్టామినాను నిరూపించాయి. ఇందులో తన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. తొలి సినిమా రిలీజ్ కాకుండానే.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

  • Published Jul 11, 2024 | 4:49 PMUpdated Jul 11, 2024 | 4:49 PM
ఆ తెలుగు హీరో కారణంగా KGF బ్యూటీకి గుడ్ టైమ్!

కన్నడ ఇండస్ట్రీ నుండి దూసుకొచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో చందన సీమనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేశాడు. కన్నడ పరిశ్రమ మార్కెట్ పెంచేశాయి ఈ రెండు చిత్రాలు. ఇక సలార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలకే ఎదురెళ్లాడు. ప్రస్తుతం సలార్ 2, ఎన్టీఆర్ సినిమాల ప్రాజెక్ట్స్ వర్క్‌తో ఫుల్ బిజీలో ఉన్నాడు నీల్ మామ. ఈ విషయాన్ని పక్కన పెడితే.. కేజీఎఫ్ చిత్రాలతో ఫేమస్ అయిన భామ శ్రీనిధిశెట్టి. 2016 అందాల పోటీల్లో గెలిచిన ఈ భామ.. రెండేళ్ల తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో ఆమెకు గోల్డెన్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది.

విక్రమ్ కోబ్రా మూవీలో నటించింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఆచి తూచి సినిమా సెలక్ట్ చేసుకుంటుంది. ఈ కన్నడ కస్తూరి తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. తెలుసు కదా అనే మూవీతో టాలీవుడ్ తెరంగేట్రం చేస్తుంది. ఇందులో జొన్నలగడ్డ సిద్దు, రాశి ఖన్నా నటిస్తున్నారు. దీనితో పాటు కిచ్చా సుదీప్ 47లో కూడా నటించనుంది. ఇప్పుడు ఆమె మరో ప్రాజెక్టుకు ఓకే చేసింది. తొలి తెలుగు మూవీ రిలీజ్ కాకుండానే మరో సినిమాలో నటించే గోల్డెన్ ఆఫర్ కొట్టేసింది ఈ అందాల భామ. హిట్ సిరీస్‌లో యాక్ట్ చేయనుంది. హిట్ 3 కోసం ఆమె సైన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో మళ్లీ బిజీగా మారుతోంది. హిట్ యూనివర్శ్ చిత్రాల్లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే హిట్ 2 ఎండింగ్ లో మరో కొత్త కేసు సాల్వ్ చేసేందుకు వచ్చేశాడు నాచురల్ స్టార్ నాని. దీన్ని కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.

వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. న్యాచురల్ నాని సమర్పకుడిగా వ్యవహరించాడు. క్రైం కథల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి హిట్, హిట్ 2 చిత్రాలు. హిట్ మూవీలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ నటించారు. ఇక హిట్ ద సెకండ్ కేస్ చిత్రంలో అడివి శేష్, మీనాక్షి చౌదరి మెయిన్ లీడ్స్. ఈ రెండు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబుట్టుకున్నాయి. హిట్ 6 కోట్లతో తెరకెక్కిస్తే.. రూ. 25 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక హిట్ 2 రూ.45 కోట్ల వరకు కొల్లగొట్టింది. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. హాయ్ నాన్న తర్వాత సరిపోదా శనివారం మూవీ ఎనౌన్స్ చేశాడు. అంటే సుందరానికి మూవీ డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయకు మరో ఛాన్స్ ఇచ్చాడు నాచురల్ స్టార్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom