iDreamPost
android-app
ios-app

ఖరీదైన కారు కొన్న రాకీ భాయ్.. దాని ధరతో ఓ రేంజ్ మూవీ తీయెుచ్చు!

  • Author Soma Sekhar Published - 03:01 PM, Fri - 16 June 23
  • Author Soma Sekhar Published - 03:01 PM, Fri - 16 June 23
ఖరీదైన కారు కొన్న రాకీ భాయ్.. దాని ధరతో ఓ రేంజ్ మూవీ తీయెుచ్చు!

KGF స్టార్ యశ్.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శత్వంలో వచ్చిన కేజీఎఫ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఒక్కసారిగా హీరో యశ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇక తాజాగా వార్తల్లో నిలిచాడు రాకీ భాయ్. దానికి కారణం అతడు ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడమే. దాని ధరతో ఓ రేంజ్ మూవీనే తీయెుచ్చు అంటే అతిశయోక్తికాదేమో. ఇంతకీ రాకీ బాయ్ కొన్న ఆ కారు ధర ఎంతో? ఇప్పుడు తెలుసుకుందాం.

యశ్.. అలియాస్ రాకీ భాయ్.. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కేజీఎఫ్ హిట్ తో కన్నడ సినీ పరిశ్రమతో పాటుగా టాలీవుడ్ లో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేయడంతో వార్తల్లోకి ఎక్కాడు రాకీ భాయ్. యశ్ SUV రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ.4 కోట్లు అని సమాచారం.

ఈ రేంజ్ రోవర్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 13.7 ఇంచుల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటుగా.. 13.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లేను కలిగిఉంది. వెనక కూర్చునే వారికి 11.4 అంగుళాల వినోద ప్రదర్శన కూడా ఆస్వాదించవచ్చు. ఇది ముందు, వెనక సీట్ లకు జోడించి వచ్చింది. వీటితో పాటుగా మరెన్నో కొత్త ఫీచర్లను కలిగి ఉంది ఈ రేంజ్ రోవర్. ఇక ఈ కారు ముందు తన భార్యా, పిల్లలతో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రాకీ భాయ్ కారుకొన్న డబ్బులతో ఓ రేంజ్ సినిమా తీయెుచ్చు అంటున్నారు నెటిజన్స్. అయితే యశ్ మాత్రం కేజీఎఫ్ 2 తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించలేదు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş