iDreamPost
android-app
ios-app

వీడియో: ‘చుట్టమల్లే సాంగ్’ పాడిన కేతికా శర్మ.. మరీ ఇంత క్యూట్ గానా..

Ketika Sharma Singing Devara Chuttamalle Song: పూరి జగన్నాథ్ హీరోయిన్ కేతికా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఈ అమ్మడు ఇప్పుడు కొత్తగా సింగర్ లా మారిపోయింది. దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ పాడి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేసింది.

Ketika Sharma Singing Devara Chuttamalle Song: పూరి జగన్నాథ్ హీరోయిన్ కేతికా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఈ అమ్మడు ఇప్పుడు కొత్తగా సింగర్ లా మారిపోయింది. దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ పాడి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేసింది.

వీడియో: ‘చుట్టమల్లే సాంగ్’ పాడిన కేతికా శర్మ.. మరీ ఇంత క్యూట్ గానా..

ప్రస్తుతం ఏ తారక్ ఫ్యాన్ ని కదిలించినా.. ఏ జాన్వీ కపూర్ ఫ్యాన్ ని కదలించినా.. అంతెందుకు ఏ మ్యూజిక్ లవర్ ని కదిలించినా కూడా.. ‘ఎందుకు పుట్టిందో పుట్టింది.. నువ్వంటే ముచ్చట పుట్టింది’ అనే పాటనే హమ్ చేస్తున్నారు. సాధారణ మ్యూజిక లవర్స్ పాడితో ఏకే గానీ.. సెలబ్రిటీలు, హీరోయిన్స్ కూడా ఇదే పాటను హమ్ చేస్తున్నారు. పాట నేర్చుకోవడమే కాకుండా.. సింగర్స్ కి పోటీగా పాడేస్తున్నారు కూడా. ఇప్పుడు పూరి జగన్నాథ్ హీరోయిన్ కేతికా శర్మ కూడా దేవర చుట్టమల్లే సాంగ్ పాడింది. కేవలం సాంగ్ పాడటమే కాకుండా.. అందులో వచ్చే ఒక హస్కీ వాయిస్ కి అర్థం కూడా చెప్పుకొచ్చుంది. ఈమె ఎంత క్యూట్ గా పాడింది అంటే.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సాధారణంగా సినిమా అప్ డేట్స్ లో భాగంగా ఒక సాంగ్ వస్తే అది కచ్చితంగా వైరల్ అవుతుంది. పాటలో కాస్త విషయం ఉన్నా కూడా దానిని ఎవరూ ఆపలేరు. అలాంటి దేవర నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే సాంగ్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది. అలాంటిది ఆ పాట వైరల్ కాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఈ పాటనే హమ్ చేస్తున్నారు. తాజాగా కేతికా శర్మ తన ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో ఒకరు చుట్టమల్లే సాంగ్ పాడమని కోరారు. ఫ్యాన్స్ అడగటం.. హీరోయిన్స్ చేయకపోవడమా? వెంటనే కేతికా శర్మ ఆ సాంగ్ ని హమ్ చేసింది. అది కూడా ఎలా అంటే.. ఒరిజినల్ సాంగ్ పాడిన శిల్పారావ్ రేంజ్ లో అద్భుతంగా పాడేసింది.

kethika sharma sing devara song

పాడటమే కాకుండా.. సాంగ్ మధ్యలో ‘ఆ..’ అనే సౌండ్ వస్తుంది. దానిని కూడా హైలెట్ చేస్తూ కేతికా శర్మ.. తారక్ ఫ్యాన్స్ కి ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. తర్వాత చుట్టమల్లే ఒరిజినల్ సాంగ్ ని కూడా పెట్టి తన ఆనందాన్ని వ్యక్త పరచింది. ప్రస్తుతం కేతికా శర్మ పాడిన చుట్టమల్లే సాంగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేతికా శర్మ ఇంత బాగా పాడుతుందా? అని తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోవడమే కాకుండా.. ఆమె టాలెంట్ ని మెచ్చేసుకుంటున్నారు. కేతికా శర్మ పూరిజగన్నాథ్ ప్రొడ్యూస్ చేసిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు చేసినా సరైన బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తోంది. సోషల్ మీడియాలో కేతికా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. మరి.. కేతికా శర్మ పాడిన చుట్టమల్లే సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.