iDreamPost
android-app
ios-app

కీర్తి సురేష్‌ కొత్త మూవీ.. తెలుగులో నో రిలీజ్.. కారణమిదేనా!

  • Published Aug 12, 2024 | 1:36 PM Updated Updated Aug 12, 2024 | 3:19 PM

Raghu Thatha Movie: అదేంటో తెలియదు కానీ.. కొన్ని సినిమాలను ఇతర భాషలలో రిలీజ్ చేస్తున్నపుడు .. అందులో మనకు తెలిసిన స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా.. తెలుగు రిలీజ్ కు నోచుకోవు. ఇప్పుడు కీర్తి సురేష్ నటిస్తున్న కొత్త సినిమా విషయంలోను ఇదే జరిగింది.

Raghu Thatha Movie: అదేంటో తెలియదు కానీ.. కొన్ని సినిమాలను ఇతర భాషలలో రిలీజ్ చేస్తున్నపుడు .. అందులో మనకు తెలిసిన స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా.. తెలుగు రిలీజ్ కు నోచుకోవు. ఇప్పుడు కీర్తి సురేష్ నటిస్తున్న కొత్త సినిమా విషయంలోను ఇదే జరిగింది.

  • Published Aug 12, 2024 | 1:36 PMUpdated Aug 12, 2024 | 3:19 PM
కీర్తి సురేష్‌ కొత్త మూవీ.. తెలుగులో నో రిలీజ్.. కారణమిదేనా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ అమ్మడు డైరెక్ట్ గా తెలుగులో తీసిన సినిమాలు తక్కువే అయినా కూడా.. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంతో.. స్పెషల్ హైప్ క్రియేట్ అయింది. ఇక మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ నెక్ట్ లెవెల్ కు మారిపోయిందని చెప్పి తీరాల్సిందే. అయితే తీసిన ప్రతి సినిమా హిట్ కావాలనే రూల్ ఏమి లేదు కాబట్టి.. కీర్తికి కూడా డిజాస్టర్స్ ఎదురయ్యాయి. కానీ ఫాలోయింగ్ కు మాత్రం ఏ లోటు లేదు. ఈ క్రమంలోనే కీర్తి తాజాగా నటిస్తున్న మూవీ ‘రఘు తాత’.. ఈ సినిమాను ఆగష్టు 15న థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అసలు కీర్తి సురేష్ ‘రఘు తాత’ అనే సినిమాను తీస్తున్నట్లు కానీ.. ఆగష్టు 15న మూవీ రిలీజ్ కాబోతున్నట్లు కానీ.. ఇప్పటివరకు ఎక్కడ బజ్ వినిపించలేదు. పైగా ఈ సినిమాను కెజిఫ్ మూవీ నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. అలాంటప్పుడు ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడాలి. కానీ ఇంతవరకు ఎక్కడా టాక్ వినిపించలేదు. ఎందుకంటే ఈ సినిమాను మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడం లేదు కాబట్టి. ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేస్తూ.. ఆగష్టు 15 కు మిస్టర్ బచ్చన్ , డబుల్ ఇస్మార్ట్ , అలాగే హిందీలో స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలు లైన్ లో ఉన్నాయి. ఈ సమయంలో కేవలం కీర్తి సురేష్ క్రేజ్ ను బేస్ చేసుకుని.. తెలుగులో ‘రఘు తాత’ మూవీ రిలీజ్ చేయడం రిస్క్ అవుతుంది. ఒకవేళ కథ బావుంటే సరే .. లేదంటే అనవసరంగా సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందనే కారణంతోనే మేకర్స్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదు.

Raghu Thatha

అయితే కథలో కంటెంట్ ఉండి.. ఒరిజినల్ వెర్షన్ లో ప్రేక్షకులను ఈ మూవీ మెప్పిస్తే కనుక.. రెండు మూడు వారాలలోనే తెలుగు వెర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు బజ్ లేకపోయినా కూడా.. ఇన్ని సినిమాల మధ్యలో రిలీజ్ చేస్తున్నారంటే.. కథలో ఎదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందేమో అని భావిస్తున్నారు ప్రేక్షకులు. మూవీ రిలీజ్ అయితే కానీ.. ఈ సినిమా గురించి ఏమి చెప్పలేము. ఇక ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో.. తెలుగులో వస్తుందో లేదో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet