iDreamPost
android-app
ios-app

నటి కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. నడిరోడ్డులో లైంగిక వేధింపులు

  • Published Nov 23, 2023 | 1:37 PM Updated Updated Nov 23, 2023 | 1:37 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా కీర్తి సురేష్‌ ఈ జాబితాలో చేరారు. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

ప్రస్తుతం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఆరోపణలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా కీర్తి సురేష్‌ ఈ జాబితాలో చేరారు. తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

  • Published Nov 23, 2023 | 1:37 PMUpdated Nov 23, 2023 | 1:37 PM
నటి కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. నడిరోడ్డులో లైంగిక వేధింపులు

కీర్తి సురేష్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్‌. ఆ తర్వాత వరుస సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ పోయింది. ఈ క్రమంలో సావిత్రి.. జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమా కీర్తి సురేష్‌ కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పడమే కాక.. నటిగా ఆమెను మరో స్థాయికి తీసుకెళ్లి నిలిపింది. ఈ సినిమాలో ఆమె అద్భుత నటనకు ప్రశంసలు మాత్రమే కాక.. ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.

అయితే మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌ కెరీర్‌ కాస్త గాడి తప్పిందని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత ఆమె చేసిన మూవీలేవి సరైన విజయాన్ని దక్కించుకోలేదు. ఈ క్రమంలో మహేష్‌ బాబు సరసన చేసిన సర్కారు వారి పాట కీర్తి సురేష్‌ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టిందని చెప్పవచ్చు. ఆ తర్వాత దసరా సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇక కొన్ని రోజుల క్రితం విడుదలైన భోలా శంకర్‌ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించింది. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్‌.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఆ వివరాలు..

ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురు చూస్తున్నాయి. మన్సూర్‌ అలీ ఖాన్‌.. నటి త్రిష గురించి చేసిన కామెంట్స్‌ మరిచిపోకముందే.. కోలీవుడ్‌ సీనియర్‌ నటి విచిత్ర.. టాలీవుడ్‌ టాప్‌ హీరో మీద క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జాబితాలోకి హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా చేరారు. తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. నడిరోడ్డులో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా కీర్తి సురేష్‌ మాట్లాడుతూ..‘‘కాలేజీలో చదుకునే రోజుల్లో నాకు ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ రోజు నేను, నా స్నేహితురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాము. ఇంతలో ఒక తాగుబోతు మాకు ఎదురుగా వచ్చి.. నాతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతడు నా మీదకు రాబోయాడు. అప్పటికే అతడి ప్రవర్తన పట్ల ఆగ్రహంగా ఉన్న నేను ఆ తాగుబోతును కొట్టాను. దాంతో అతడు భయపడి అక్కడ నుంచి వెళ్లిపోయాడు’’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన వారు కీర్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

బాలీవుడ్‌ ఎంట్రీ..

సీనియర్ హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. తల్లి వారసత్వాని నిలబెడుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం అన్ని భాషల్లో కలిపి ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇక కీర్తి త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. వరుణ్ ధావన్‌ సరసన ఓ చిత్రంలో నటించనుంది.

ఇక ఈ బ్యూటీ నార్త్ డెబ్యూకి దక్షిణాది స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ హెల్ప్ చేయనున్నారని సమాచారం. రీసెంట్‌గా జవాన్ సినిమాతో బాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకున్న అట్లీ నిర్మాతగా బీటౌన్‌లో జెండా పాతేందుకు రెడీ అవుతున్నారు. తాను తమిళ్‌లో రూపొందించిన తెరి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారని.. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ నటించనుందని వార్తలు వస్తున్నాయి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap