iDreamPost
android-app
ios-app

కుమారీ ఆOటీ ఫుడ్ బాలేదన్న కీర్తి భట్ దంపతులు.. ట్రోల్స్ కి కౌంటర్స్!

  • Published Mar 21, 2024 | 6:02 PM Updated Updated Mar 21, 2024 | 6:02 PM

కుమారి ఆంటీ బిజినెస్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. అయితే, ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ .. తన భర్తతో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేసి దాని గురించి వరస్ట్ రివ్యూ ఇచ్చింది. అయితే, అది కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు డిస్కషన్స్ కు దారి తీసింది.

కుమారి ఆంటీ బిజినెస్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. అయితే, ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ .. తన భర్తతో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేసి దాని గురించి వరస్ట్ రివ్యూ ఇచ్చింది. అయితే, అది కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు డిస్కషన్స్ కు దారి తీసింది.

  • Published Mar 21, 2024 | 6:02 PMUpdated Mar 21, 2024 | 6:02 PM
కుమారీ ఆOటీ ఫుడ్ బాలేదన్న కీర్తి భట్ దంపతులు.. ట్రోల్స్ కి కౌంటర్స్!

కొన్ని నెలల క్రితం వరకు కుమారి ఆంటీ ఎవరో ఎవరికీ తెలియదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయిపొయింది. ఆమెతో పాటు ఆమె బిజినెస్ కూడా బాగానే ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు ఆమె ఫుడ్ బిజినెస్ తో పాటు.. అటు సీరియల్స్ , సినిమాలు, టీవీ షో లు, ఇంటర్వూస్ తో బిజీ బిజీ అయిపొయింది. అయితే, ఇప్పుడు అసలు విషయానికొస్తే.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన భర్తతో కలిసి.. కొన్ని రోజుల క్రితం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్ళింది. ఆ ఫుడ్ స్టాల్ కు అంతగా క్రేజ్ పెరగడంతో.. ఆమె కూడా ఆ ఫుడ్ ను టేస్ట్ చేసింది. కానీ, ఆ ఫుడ్ గురించి.. టేస్ట్ లేదని, వేస్ట్ అంటూ రివ్యూ ఇచ్చింది. దీనితో ఈ వ్యాఖ్యలు కాస్తా.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కొంతమంది ఆమెకు సపోర్ట్ గా మాట్లాడగా.. మరి కొంతమంది ఆమెను విమర్శించారు. ఇక దీనిపై కీర్తి భట్ భర్త స్పందిస్తూ రీసెంట్ గా మరో వీడియో ను పోస్ట్ చేశారు.

కీర్తి భట్ భర్త ఈ వివాదాస్పద చర్చలపై క్లారిటీ ఇస్తూ ఇలా మాట్లాడారు “మేము రీసెంట్‌గా కుమారి ఆంటీ ఫుడ్‌ గురించి ఓ వీడియో చేశాం. దానిపై చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మేము తెలంగాణా వాళ్లం.. మేము ఆంధ్రా వాళ్లం.. మేము ఎక్కువ కారం తింటాం. మీరు ఎక్కువ కారం తినరు. కారం ఎక్కువైతే మీరు కర్ణాటకకి వెళ్లిపోండి అని అంటున్నారు. నేను కూడా పక్కా రాయలసీమ వాడినే. నేను కూడా కారం ఎక్కువ తింటాను. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లు.. మేం చేసిన పూర్తి వీడియో చూడండి. మేం ఏమన్నామో గమనించండి. మేం చెప్పింది ఏంటంటే.. చికెన్ కర్రీలో కారం గురించి. ఆరోజు మేము అక్కడ తిన్నప్పుడు కూరలో కారం ఎక్కువగా అనిపించింది. మసాలా ఎక్కువనిపించింది. అదే మేము చెప్పాము.

Kumari aunty keerthi bhat

మేము చెప్పడం వలెనే కుమారీ ఆంటీకి ఏదో పెద్ద నష్టం జరిగినట్టు మాట్లాడుతున్నారు. కుమారి ఆంటీకి మా వల్ల బిజినెస్ లాస్ కావడం ఏంటి? తినేవాడు ఎలాగైనా తింటాడు. మేం చెప్పగానే వాళ్లకి లాస్ రాదు. కామెంట్ పెట్టేముందు ఆలోచించి పెట్టండి. కుమారి ఆంటీ కాబట్టి వీడియో చేశారు.. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే ఇలా చెప్తారా? అని అంటున్నారు.ఎక్కడ తిన్నాసరే.. బాగుంటే బాగుందని చెప్తాము. బాలేదంటే బాలేదని చెప్తాము. కుమారి ఆంటీ అంటే చిన్న.. వేరే వాళ్లు అంటే పెద్ద అని కాదు. అంబానీ హోటల్‌కి వెళ్లినా కూడా ఇదే చెప్తాము” అంటూ చెప్పుకొచ్చారు కీర్తి భట్ భర్త కార్తీక్. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ వ్యాక్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Karthek Thota (@its_vijay_karthek)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş