iDreamPost
android-app
ios-app

40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కత్రినా కైఫ్!

  • Published Mar 05, 2024 | 2:43 PM Updated Updated Mar 05, 2024 | 2:43 PM

Katrina Kaif Pregnant News Viral:సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లీస్ట్ లో చేరారు బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.

Katrina Kaif Pregnant News Viral:సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లీస్ట్ లో చేరారు బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.

  • Published Mar 05, 2024 | 2:43 PMUpdated Mar 05, 2024 | 2:43 PM
40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కత్రినా కైఫ్!

ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు వరుసగా గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఈ మధ్యనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-నటి అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ రణవీర్ సింగ్ – దీపికా పదుకొనె త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు అభిమానులకు శుభవార్త చెప్పారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విక్కీ కౌశల్ ఇంటికి త్వరలో స్పెషట్ గెస్ట్ వస్తాడంటూ నటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి మూవీలో నటించింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ లోని జామ్‌నగర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో భారత్ కి సంబంధించిన సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. జామ్‌నగర్ లో జరిగిన వేడుకకు బాలీవుడ్ కపుల్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జంటగా వెళ్లారు. ఆ సమయంలో ఆమె తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే దాచుకోడం కెమెరా కంట పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కత్రినా-విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

విక్కీ కౌశల్ – కత్రినా కొంతకాలం ప్రేమించుకొని సహజీవనం చేశారు. పెద్దలను ఒప్పించి 2021, డిసెంబర్ లో హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట పెళ్లై మూడేళ్లవుతుంది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఫోటో షూట్ సందర్భంగా కత్రినా కైఫ్ లైట్ గులాబీ రంగులో డ్రెస్ వేసుకొని ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే కత్రినా ప్రెగ్నెన్సీ పై ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు. ఈ మధ్యనే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె తాను తల్లిని కాబోతున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş