iDreamPost
android-app
ios-app

మళ్లీ వస్తోన్న కార్తీక దీపం సీరియల్.. ప్రోమో రిలీజ్

  • Published Feb 19, 2024 | 5:17 PM Updated Updated Feb 19, 2024 | 5:17 PM

తెలుగు బుల్లితెరపై ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. గత ఏడాది ఎండ్ కార్డు పడి.. అనేక మంది అభిమానుల్ని బాధపెట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్ రాబోతుంది.

తెలుగు బుల్లితెరపై ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. గత ఏడాది ఎండ్ కార్డు పడి.. అనేక మంది అభిమానుల్ని బాధపెట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్ రాబోతుంది.

  • Published Feb 19, 2024 | 5:17 PMUpdated Feb 19, 2024 | 5:17 PM
మళ్లీ వస్తోన్న కార్తీక దీపం సీరియల్.. ప్రోమో రిలీజ్

బుల్లితెరపై మహిళల్ని ఆకట్టుకుంటున్నాయి ధారావాహికలు. సీరియల్స్ లేనిదో రోజు గడవదు నారీ మణులకు. పొద్దున్న నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే సీరియల్స్ చూస్తూనే ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటున్నారు మహిళలు. ఒక వేళ అప్పుడు మిస్ అయినా.. యూట్యూబ్ ఇతర ఇతర యాప్స్ ద్వారా వాచ్ చేస్తుంటారు. ఒక్క రోజు ఆ సీరియల్ మిస్ అయినా.. పక్కింటి, ఎదురింటి వాళ్లనైనా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తానికి సీరియల్స్ చూడకుండా ఉండలేరు. అలా ఇటీవల కాలంలో విశేషమైన ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన సీరియల్ కార్తీక దీపం. గత ఏడాది అర్ధాంతరంగా ముగిసి అభిమానుల్ని బాధపెట్టింది.

ఇప్పుడు డాక్టర్ బాబు, వంటకల్క ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త ఒకటి చెప్పింది స్టార్ మా. కార్తీక దీపం మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. గత ఏడాది ఎండ్ కార్డు పడిన ఈ సీరియల్.. కొత్త వెలుగులతో రాబోతుంది. గతంలో కార్తీక దీపానికి కొనసాగింపు ఉంటుందని ఒకసారి.. ఉండదని మరోసారి చెప్పినప్పటికీ.. ఇప్పుడు ఇదే పేరుతో సీరియల్ రాబోతుంది. కార్తీక దీపం 2017లో అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ సీరియల్.. గత ఏడాది జనవరి 23న శుభం కార్డుతో ముగిసింది. అయితే ఈ సీరియల్ ముగిసిన తర్వాత పలు సీరియల్స్ ఆ ప్లేస్‌ను రీప్లేస్ చేసేందుకు ప్రయత్నించాయి కానీ.. ఈ సీరియల్ అంతా పేరు, రేటింగ్ మిగిలిన వాటికి రాలేదు.

దీంతో కార్తీక దీపం సీరియల్ రంగంలోకి దింపుతు స్టార్ మా టీం. గత కార్తీక దీపాన్ని కథ హడావుడిగా ముగిసిపోయిది. ఇప్పుడు కొత్త కథలో డాక్టర్ బాబు, వంటలక్క ఉంటారా అంటే సీరియల్ ప్రసారమయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. అయితే ఇటీవల విడుదలైన ప్రోమోలో ‘నాకు చీకటంటే భయం..ఈ చీకట్లో  నాకు ధైర్యం ఇచ్చే వెలుగే మా అమ్మ. కష్టాల నుండి కాపాడే మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు. నాకు అన్నీ  మా అమ్మే. ఇంతకు  నా పేరు ఏంటో తెలుసా..  శౌర్య . నేనిప్పుడు చెప్పబోయేది మా అమ్మ నాన్నల కథ’ అని చెబుతుంది. ఇక పాత కథ విషయానికి వస్తే.. అందులో డాక్టర్ బాబు, వంటలక్కకు కూతుర్లు ఉంటారు.   వీరి కూతుర్లలో ఒకరి పేరు శౌర్య. మరీ ఇప్పుడు ఈ కథ ఎలా ఉంటుందో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom