iDreamPost
android-app
ios-app

ఆ తెలుగు హీరోయిన్ లక్ మార్చబోతున్న కార్తీ

  • Published Feb 03, 2024 | 4:12 PM Updated Updated Feb 03, 2024 | 4:12 PM

కోలీవుడ్ హీరో కార్తీ డిఫరెంట్ స్టోరిస్ ను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్త దనాన్ని నింపడంలో ఎప్పుడూ ముందుంటాడు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న సినిమాల్లో ఓ తెలుగు హీరోయిన్ లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. ఇంతకి ఆమె ఎవరంటే..

కోలీవుడ్ హీరో కార్తీ డిఫరెంట్ స్టోరిస్ ను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్త దనాన్ని నింపడంలో ఎప్పుడూ ముందుంటాడు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న సినిమాల్లో ఓ తెలుగు హీరోయిన్ లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 03, 2024 | 4:12 PMUpdated Feb 03, 2024 | 4:12 PM
ఆ తెలుగు హీరోయిన్ లక్ మార్చబోతున్న కార్తీ

కోలీవుడ్ హీరో కార్తీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగులో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతలా కార్తీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండేల్లో నిలిచాడు. అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కార్తీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరిస్ ను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్త దనాన్ని నింపుతాడు. ఈ తరహాలోనే కార్తీ గతేడాది ‘జపాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతీ తెలిసిందే. ఈ సినిమాను రాజు మురుగున్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కార్తీకి సరసన అను ఇమ్యాన్యుయేల్‌ నటించారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన జపాన్ సినిమా ఆశించన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. కార్తీ ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు. అయితే ఈ సినిమాలో ఓ తెలుగు హీరోయిన్ నటించబోతుందనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

తాజాగా కార్తీ నటిస్తున్న 27వ చిత్రంలో ఓ తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు. ఆమె ఎవరో కాదు, మన తెలుగు అమ్మాయి ‘శ్రీ దివ్య’. ఇటీవలే ఈ అమ్మాడు చాలాకాలం తర్వాత విక్రమ్ ప్రభు సరసన నటించిన ‘రైడ్’ చిత్రం ద్వారా తెరపైకి వచ్చింది. అలా మళ్లీ శ్రీ దివ్య సినిమాలపై దృష్టి పెట్టడంతో.. కార్తీ సరసన హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా కార్తీ సినిమాలో శ్రీ దివ్య పేరును చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇంతకు ముందు కూడా కార్తీ సరసన శ్రీ దివ్య ‘కాశ్మోరా’ చిత్రంలో నటించిన సంగతీ తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాను ’96’ చిత్రం ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Karthi is going to change that Telugu heroine's luck

ఇక శ్రీ దివ్య మొదటగా శివకార్తికేయన్ కు జంటగా ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’ చిత్రం ద్వారా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి మార్కులు వేసుకున్న శ్రీ దివ్యకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో తెలుగులోనూ ఈ బ్యూటీకి పలు అవకాశాలు అందడంతో మనసారా, బస్ స్టాప్ తదితర చిత్రాల్లో నటించి మంచి హిట్ లు అందుకుంది. మరి, కాశ్మోర సినిమా తర్వాత కార్తీ, శ్రీ దివ్య మళ్లీ స్క్రీన్ షేరు చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ర రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş