iDreamPost
android-app
ios-app

వీడియో: విశాల్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్తీ!

  • Published Nov 08, 2023 | 12:05 PM Updated Updated Nov 08, 2023 | 12:05 PM

హీరో కార్తీ నటించిన ‘జపాన్‌’ మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. జపాన్‌ తమిళంతోనూ తెలుగులోనూ ఏక కాలంలో విడుదల కానుంది.

హీరో కార్తీ నటించిన ‘జపాన్‌’ మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు. జపాన్‌ తమిళంతోనూ తెలుగులోనూ ఏక కాలంలో విడుదల కానుంది.

  • Published Nov 08, 2023 | 12:05 PMUpdated Nov 08, 2023 | 12:05 PM
వీడియో: విశాల్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్తీ!

తమిళ చిత్ర పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటూ ఓ ఇద్దరి పేర్లు చెప్పాల్సి వస్తే.. కార్తీ – విశాల్‌ల పేర్లు తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. వీరిద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్యా స్నేహం కొనసాగింది. వ్యక్తిగతంగానే కాదు.. ఒకరి సినిమా విషయంలో మరొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు. నడిగర్‌ సంఘం ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసి పోటీ చేశారు. ఘన విజయం కూడా సాధించారు. తాజాగా, జపాన్‌ సినిమా ఈవెంట్‌లో విశాల్‌ పాల్గొన్నారు.

ఈవెంట్లో విశాల్‌పై కార్తీ ఫన్నీ కామెంట్లు చేశారు. విశాల్‌ కారణంగా తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని ఆయన అన్నారు. కార్తీ మాట్లాడుతూ.. ‘‘  నేను విశాల్‌ గురించి మాట్లాడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే.. బ్యాక్‌ స్టేజీలో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. లేదా ఈపాటికి స్టేజిమీద నుంచి పారిపోయి ఉంటాడు. విశాల్‌ను చూసి నేను గర్వ పడే విషయం ఏంటంటే.. ధైర్యం. నాకు తెలుసు వాళ్ల ఫ్యామీలో ఉన్న ఓ కష్టమైన పరిస్థితిని అతడే రంగంలోకి దిగి సాల్వ్‌ చేశాడు. ఇతడికి ఉన్న టెన్షన్లకు ఎలా నవ్వుతూ తిరుగుతున్నాడో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది’’ అని అన్నాడు.

అప్పుడు స్టేజి మీద ఉన్న హీరో ఆర్య ‘‘ లేదురా.. వాడే ఓ సమస్య’’ అని అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వేశారు. ఆ వెంటనే కార్తీ కొనసాగిస్తూ.. ‘‘ సంతానంది ఓ డైలాగ్‌ ఉంది. ఒక్కోరికి పది మంది , 20 మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. నేను ఒక్క ఫ్రెండుతో పడుతున్న కష్టాలు.. అయ్యయ్యో… అన్నట్లు.. ఒక్కో రోజు ఒక్కో సమస్యతో ఉంటాడు. న్యూస్‌ చూసినపుడు మనకే ఆశ్చర్యంగా ఉంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, కార్తీ, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన ‘జపాన్‌’ నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కేఎస్‌ రవికుమార్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో రిలీజ్‌ అవ్వనుంది. కొద్దిరోజుల కిత్రమే తెలుగుకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. నాచురల్‌ స్టార్‌ నానీ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కార్తీ.. నానిపై ప్రశంసల జల్లులు కురిపించారు. మంచి కథను ఆదరించటంలో నానీ ముందు వరుసలో ఉంటారని అన్నారు. మరి, విశాల్‌పై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş