Dharani
Dharani
కరాటే కళ్యాణి.. సినిమాలతో కన్నా.. వివాదాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం.. వార్తల్లో నిలవడం కరాటే కల్యాణికి కొత్త కాదు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు సందర్బంగా కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు ఏంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ విగ్రహంపై పోరాటం చేసి విగ్రహ ఏర్పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో మా సభ్యత్వం కూడా తొలగించారు. కొన్ని రోజుల క్రితమే కరాటే కళ్యాణి..తనకు ప్రాణ హానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా మరో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కరాటే కళ్యాణి. ఆ వివరాలు..
తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫ్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధ నగ్న ఫోటోలను వైరల్ చేస్తున్నారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు కల్యాణి ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో 469,506,509 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. లలిత్ కుమార్, ఓంకార్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, దుర్గారావు,రాం బాబు, నితీష్ గుప్తా, నర్సింహ గౌడ్ లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
కరాటే కళ్యాణి పాత సినిమా సన్నివేశాల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు లలిత్ కుమార్ టీం. వీరంతా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు భంగం కల్పిస్తున్నారంటూ కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎదుగుదల తట్టుకోలేక సోషల్ మీడియాలో లలిత్ కుమార్ టీం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు లలిత్, మిగతా వారి మీద కేసు నమోదు చేశారు.