iDreamPost
android-app
ios-app

మహాశివరాత్రి నాడు కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్! మంచు విష్ణు అదరగొట్టాడు!

Kannappa First Look Poster.. మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ సినిమా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. లుక్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Kannappa First Look Poster.. మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈ సినిమా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. లుక్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

మహాశివరాత్రి నాడు కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్! మంచు విష్ణు అదరగొట్టాడు!

మంచు మోహన్ బాబు వారసుల్లో ఒకరు మంచు విష్ణు భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఎవీఎ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. న్యూజిలాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన చిత్ర యూనిట్..వారం క్రితం సెకండ్ షెడ్యూల్ స్టార్ చేసింది. మళ్లీ న్యూజిలాండ్‌లో ల్యాండ్ అయ్యింది. సుమారు వంద కోట్లతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఈ ఏడాది మలి సగంలో రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది.

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పరమ శివుడికి మహా భక్తుడిగా పేరు గాంచిన కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటించారు. గతంలో ఆయన పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాణం విల్లు ఎక్కుపెట్టే కన్నప్పను చూపించారు. ఆరు భాషలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు కన్నప్ప అనగానే ఆటవికుడిగా, కోయ వ్యక్తిగా చూపించగా.. ఇప్పుడు ఓ వారియర్ గా చూపించారు. శారీర ధారుడ్యం, సూటిగా చూస్తూ విల్లును ఎక్కు పెట్టిన వీరుడిగా విష్ణు కనిపిస్తున్నాడు. జలపాతాల్లో నుండి గురి పెట్టిన వేటగాడిగా కనిస్తున్నాడు విష్ణు. పోస్టర్ డిజైనింగ్ సినిమాపై హైప్స్ క్రియేట్ చేస్తుంది.

ఇందులో హీరోయిన్‌గా ప్రీతి కందన్ నటిస్తోంది. ప్రభాస్ శివుడి పాత్రను పోషించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో పార్వతి రోల్ లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. మోహన్ లాల్, మోహన్ బాబు, మధుబాల, ఆర్ శరత్ కుమార్, దేవరాజ్ వంటి సీనియర్ స్టార్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంతోనే మంచు వారసుడు అవ్రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్టీఫెన్ దేవస్సీ, మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాల కృష్ణ, జి. నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, తోటా ప్రసాద్ కథ అందిస్తున్నారు. మంచు విష్ణు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet