iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నోడు.. పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ ఉన్న స్టార్ హీరో..!

ఎన్సీసీ డ్రెస్సులో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ ఉన్న హీరో. కేవలం నటుడు మాత్రమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కూడా. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఎన్సీసీ డ్రెస్సులో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ ఉన్న హీరో. కేవలం నటుడు మాత్రమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కూడా. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలోని చిన్నోడు.. పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ ఉన్న స్టార్ హీరో..!

ఈ ఫోటోలో ఎన్సీసీ డ్రెస్సులో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా..? పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ ఉన్న హీరో. పేరుకు కన్నడ స్టార్ అయినప్పటికీ.. తెలుగులో కూడా ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హీరో నటించే, తీసే సినిమాల్లో రియాలిటీ ఉంటుంది.   సామాజిక బాధ్యత కనిపిస్తుంది. అందుకే రియల్ హీరో అయ్యాడు. వర్సటాలిటీ సినిమాలకు నిలువెత్తు నిదర్శనం ఆయన చిత్రాలు. తక్కువ సమయంంలోనే చందన సీమలో టాప్ హీరోగా ఎదిగిన ఈ కుర్రాడు ఎవరంటే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన మల్టీటాలెంటర్. కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్,  లిరిసిస్ట్, పొలిటీషియన్ కూడా. ఈ హీరో పుట్టిన రోజు నేడు. రైటర్ నుండి నేడు స్టార్ హీరోగా ఎదిగిన తీరు అసమాన్యం.

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో పుట్టిన ఉపేంద్ర.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఉపేంద్ర చిన్నప్పుడే కంటి సమస్య చుట్టుముట్టింది. అందుకే అతడి కనుగుడ్లు తిప్పుతూ ఉంటారు. అదే ఆయనకు వరంగానూ మారింది. బెంగళూరులో చదువుకున్న ఆయన.. కాలేజీ డేస్ నుండే నాటకాలు వేసేవాడు. తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఉప్పీ. రైటర్‌గా జాయిన్ అయ్యి.. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అలాగే క్యామియోస్ చేశాడు. తొలిసారిగా ష్ మూవీతో డైరెక్టర్ అయ్యాడు. హీరోగా మారి.. స్వీయ దర్శకత్వంలో సినిమాలు తీశాడు. ఏ, ఉపేంద్ర వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. ఉపేంద్రను స్టార్ హీరోను చేశాయి. ఇక అక్కడ నుండి డైరెక్షన్ మీద కన్నా.. యాక్టర్‌గా ఫోకస్ పెంచాడు. .

తెలుగులో కూడా డైరెక్టర్‌గానే ఎంట్రీ ఇచ్చాడు ఉపేంద్ర.. కన్నడలో శివరాజ్ కుమార్‌తో తెరకెక్కించిన ఓమ్ మూవీని తెలుగులో రాజశేఖర్‌తో ఓంకారంగా తీశాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అప్పటికే హీరోగా ఎస్టాబ్లీష్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా హీరోగానే అవకాశాలు ఇచ్చింది. కన్యాదానం, ఒకే మాట, రా, నీతోనే ఉంటాను, టాస్ చిత్రాలు చేశాడు ఈ రియల్ స్టార్. కన్నడ బిజీయెస్ట్ స్టార్ అయిపోయినప్పటికీ.. ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చే అవకాశాలను వదిలిపెట్టలేదు. తెలుగులో ఏడేళ్లు చొప్పున గ్యాప్ తీసుకుని సన్ ఆప్ సత్యమూర్తి, గని చిత్రాల్లో నటించారు. గత ఏడాది కబ్జా మూవీతో పలకరించిన ఆయన.. ఇప్పుడు ఇటు కూలీతో పాటు కన్నడ మూడు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా యుఐ పోస్టర్ రిలీజైంది. ఈ అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Upendra Kumar (@nimmaupendra)