iDreamPost

కిచ్చ సుదీప్ కూతుర్ని ఎప్పుడైనా చూశారా..ఎంత అందంగా ఉందంటే..?

  • Published May 30, 2024 | 7:37 PMUpdated May 30, 2024 | 7:37 PM

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన కూతురికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎలా ఉందో తెలిస్తే ఆశ్ఛర్యపోతారు.

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన కూతురికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఆమె ఎలా ఉందో తెలిస్తే ఆశ్ఛర్యపోతారు.

  • Published May 30, 2024 | 7:37 PMUpdated May 30, 2024 | 7:37 PM
కిచ్చ సుదీప్ కూతుర్ని ఎప్పుడైనా చూశారా..ఎంత అందంగా ఉందంటే..?

స్టార్ హీరో కిచ్చ సుదీప్.. పేరుకు కన్నడ హీరో అయిన తెలుగులో మాత్రం ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఈయన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈగ సినిమాలో ఈయన నటన తెలుగు అడియాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సుదీప్ బహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించాడు. అయితే ప్రస్తుతానికి సుదీప్ కన్నడలో బిజీ హీరోగా మారిపోయాడు. కానీ,ఆయన నటించిన సినిమాలు అన్ని తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే సుదీప్ గతే రెండెళ్ల క్రితం నటించిన విక్రాంత్ రోణ సినిమా తెలుగులో విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే సుదీప్ కన్నడ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సుదీప్ ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, కన్నడ ప్రేక్షకులకు మాత్రం సుదీప్ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే సుదీప్ కూతురు ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకి సుదీప్ కూతురు ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

గత కొంతకాలంగా కన్నడ స్టార్ హీరో సుదీప్ కూతురి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తు్న్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ కూతురి పేరు సాన్వీ సుదీప్. కాగా, ఈ అమ్మడు రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే సాన్వీ త్వరలోనే సినిమాల్లోకి రానుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. కానీ, ఈ చిన్నదానికి కి సింగర్ అవ్వాలని డ్రీమ్ ఉందట. ఎందుకంటే.. సాన్వికి సంగీతం అంటే చాలా ఆసక్తి. అంతేకాకుండా.. పాటలు రాయడం,  అనేది తన హాబీ అంట.  అందుకే సాన్వీ తరుచు మ్యూజిక్ అల్బమ్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే.. సుదీప్ మేనల్లుడు జిమ్మీ సినిమాలో కూడా కూాడా ఈ చిన్నది ఓ పాట పాడింది. ఇదిలా ఉంటే.. తాజాగా సాన్వీకు సంబంధించి ఓ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో సాన్వీ తన మెడపై  పీకు  అనే చిన్న టాటూ వేయించుకుంటుంది.  ఇకపోతే పీకూ అంటే అర్ధం ఏమిటో అని నెటిజన్స్ తెగ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

అంతేకాకుండా.. పీకూ అనేది హిందీ సినిమా పేరు అని అనుకుంటున్నారు. కానీ, పీకూ అనేది సాన్వీ తల్లి ప్రియా సుదీప్ ముద్దుపేరు. కాగా, ప్రియా సుదీప్‌ను ఆమె తాత పీకు అని పిలుచుకునేవారు. అందుకే సాన్వీ తన తల్లి పేరును టాటూ వేయించుకుంది. ఇక ఆ టాటూ వీడియోను సాన్వీ తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఈ వీడియోను చూసిన సుదీప్ అభిమానులు, నెటిజన్స్ తన కూతురి సాన్వీని చూసి ఇంత అందంగా ఉందేంటి అంటూ షాక్ అవుతున్నారు. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుదీప్ కూతురు సాన్వీ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి