iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నోడు కోట్లాదిమంది అభిమానించే స్టార్ హీరో..ఎవరో గుర్తుపట్టారా?

  • Published Jul 12, 2024 | 9:24 PM Updated Updated Jul 12, 2024 | 9:24 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు..ఇప్పుడు ఈయన ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తనకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నటుడిగా కంటే వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించి, ఆరాధించే అభిమానులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు..ఇప్పుడు ఈయన ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తనకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నటుడిగా కంటే వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించి, ఆరాధించే అభిమానులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jul 12, 2024 | 9:24 PMUpdated Jul 12, 2024 | 9:24 PM
ఈ ఫోటోలో  చిన్నోడు కోట్లాదిమంది అభిమానించే స్టార్ హీరో..ఎవరో గుర్తుపట్టారా?

ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ నటులుగా దూసుకుపోతున్న వారిలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉండటం గమన్హారం. అయితే వారసత్వంగా సిని రంగంలో అడుగుపెట్టిన వారిలో నిలదొక్కుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో సొంత టాలెంట్ తో పైకి వచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ, ఇక్కడ స్టార్ స్టేటస్ ముఖ్యం కాదు.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకోవడం అనేది ముఖ్యం. ఎందుకంటే.. నటులుగా, స్టార్ స్టేటస్ అందరూ సంపాదించుకుంటారు. కానీ, కోట్లాది మంది గుండేల్లో అభిమానించే స్టార్ గా ఎదగడం అనేది చాలా కష్టం. మరి, అలా కేవలం నటుడిగా కాకుండా..సేవా థృక్పందంతో అందరికీ సాయం చేసే గొప్ప నటుడిగా ఎదిగిన వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరో కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇతడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. ముఖ్యంగా కోట్లాదిమంది అభిమానులు ఆరాధించే ఒక లెజెండ్. ఎవరో కనిపెట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు..ఇప్పుడు ఈయన ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో. తండ్రి వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తనకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా నటుడిగా కంటే వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించి, ఆరాధించే అభిమానులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా..? మరి, ఆయన ఎవరో కాదు.. కన్నడ సంచలనం ‘శివరాజ్ కుమార్’. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. శాండిల్ వుడ్ సూప‌ర్ స్టార్స్ లో ఈయన కూడా ఒకరు. అయితే ఈయన రాజ్ కుమార్ వార‌సుడిగా సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన నటనతో ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా.. పలు సేవా కార్యక్రమాల్లో ఆయన చేసే మంచి సింప్లిసిటీకి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు శివరాజ్ కుమార్. ఇక ఈయన పునీత్ రాజ్ కుమార్ కు అన్నయ్య అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. శివరాజ్ కుమార్  తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ముఖ్యంగా ఈయన తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో అతిథి పాత్ర చేసి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత.. జైలర్ సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించారు. ఇకపోతే తాజాగా శివరాజ్ కుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న ఆర్సీ 16లో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం శివరాజ్ కుమార్ భైరవనకొనే పాటా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు క‌న్న‌డ డైరెక్టర్ హేమంత్ రావు దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే తాజాగా ఈ సినిమాకు సంబంధించి శివ రాజ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం కూడా తెలిసిందే. అయితే ఇందులో శివరాజ్ కుమార్ యోధుడిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇకపోతే నేడు శివరాజ్ కుమార్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివ రాజ్ కుమార్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş