iDreamPost
android-app
ios-app

అమ్మాయిని ఎరగా వేసి నిర్మాతను ముంచిన దర్శకుడు.. అరెస్ట్!

  • Published Nov 24, 2023 | 3:47 PM Updated Updated Nov 24, 2023 | 3:47 PM

డబ్బు ఉన్నవాళ్లకు అందమైన అమ్మాయిలను వలగా విసిరి.. వారు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు. దేశంలో ఇటీవల హనీట్రాప్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.

డబ్బు ఉన్నవాళ్లకు అందమైన అమ్మాయిలను వలగా విసిరి.. వారు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు. దేశంలో ఇటీవల హనీట్రాప్ కేసులు ఎక్కువ అవుతున్నాయి.

  • Published Nov 24, 2023 | 3:47 PMUpdated Nov 24, 2023 | 3:47 PM
అమ్మాయిని ఎరగా వేసి నిర్మాతను ముంచిన దర్శకుడు.. అరెస్ట్!

ఇటీవల హనీట్రాప్ అనే పదం చాలా సందర్భాల్లో వినిపిస్తుంది. సామాన్యుల నుంచి సైనికుల వరకు అందరినీ కలవర పెడుతున్న సమస్య హనీట్రాప్. వీరి ఉచ్చులో పడి దేశ భద్రతను కూడా ఫణంగా పెడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అందుకే హనీ ట్రాప్ లో చిక్కుకోవొద్దని వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు హచ్చరికలు జారీ చేస్తున్నారు. కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమ మార్గాలు ఎన్నుకుంటున్నారు.. అలాంటి వాటిలో హనీ ట్రాప్ ఒకటి. అమ్మాల సహాయంతో మగావాళ్లకు ఫోన్ కాల్స్ చేయించి.. మత్తెక్కించే మాటలతో వాళ్లను ట్రాప్ లో పడేసి అందినంత దోచుకుంటున్నారు. అందమైన అమ్మాయిని వలగా వేసి ప్రొడ్యూసర్ ని నిండా ముంచిన ఓ డైరెక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా సినిమాల్లో విలన్లు డబ్బు ఉన్నవారిని టార్గెట్ చేసుకొని అందమైన అమ్మాయిలను ఎరగా వేసి వారితో శృంగార సమయంలో ఉన్నపుడు వీడియో, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజుతారు. అచ్చం అలాంటి సంఘటనలు బయట కూడా ఎన్నో జరుగుతున్నాయి. హనీట్రాప్ లో చిక్కుకొని ఎంతోమంది విల విలలాడిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీలో సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందమైన అమ్మాయిలను వలగా విసిరి డబ్బులు వసూళ్లు చేయాలని చూసిన కన్నడ డైరెక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు విషయానికి వస్తే.. ఈజీ మనీ కోసం కన్నడ డైరెక్టర్ రవీంద్ర కొంతమంది అమ్మాయిలతో ఓ నీచమైన పథకం వేశాడు. కన్నడ నిర్మాత మహాదేవ్ వద్దకు అందమైన యువతులను పంపి ఆయనను ముగ్గులోకి దింపాడు. తర్వాత డైరెక్టర్ రవీంద్ర తన వికృతరూపాన్ని బయటపెట్టాడు.

అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోలు తన వద్ద ఉన్నాయని.. మర్యాదగా తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే లైంగిక వేధింపుల కేసు పెడతామని, సోషల్ మీడియాలో పరువు తీస్తా అంటూ మహదేవన్ ని బెదిరించడం మొదలు పెట్టాడు. రాను రాను అమ్మాయి వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు నిర్మాత మహదేవ్. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన బెంగుళూరు పోలీసులు డబ్బు కోసం ఈ పని డైరెక్టర్ రవీంద్ర చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు… అతనే నింధితుడిగా తేల్చారు. అమ్మాయిలతో కలిసి నిర్మాత వద్ద డబ్బు గుంజేందుకు నాటకం ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దర్శకుడు రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. గతంలో రవీంద్ర దర్శకత్వంలో ‘బారబాత్’ మూవీ వచ్చింది. కన్నడ నాట చింగారి, శ్రీకంఠ, శిశిర తదితర చిత్రాలను నిర్మించారు మహదేవ్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet