iDreamPost
android-app
ios-app

Darshan: దర్శన్ పై ప్రేమతో అభిమాని పిచ్చి పని..వైరల్ అవతున్న ఫోటోస్

  • Published Jul 02, 2024 | 6:00 PM Updated Updated Jul 02, 2024 | 6:07 PM

కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలుకి వెళ్లినప్పటి నుంచి జైలు ముందు ఆయన అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శన్ మీద ప్రేమతో ఓ అభిమాని ఏడాది వయసున్న చిన్నారిని ఏకంగా ఖైదీలా మార్చేశాడు. కాగా,ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలుకి వెళ్లినప్పటి నుంచి జైలు ముందు ఆయన అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శన్ మీద ప్రేమతో ఓ అభిమాని ఏడాది వయసున్న చిన్నారిని ఏకంగా ఖైదీలా మార్చేశాడు. కాగా,ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Jul 02, 2024 | 6:00 PMUpdated Jul 02, 2024 | 6:07 PM
Darshan: దర్శన్ పై ప్రేమతో అభిమాని పిచ్చి పని..వైరల్ అవతున్న ఫోటోస్

ఇప్పటికే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ప్రముఖ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడ్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో పలు ఆధారాలు లభ్యం కావడంతో దర్శన్ ఈ హత్య చేయించింది దర్శన్ అని పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో దర్శన్ ను ఈ కేసుకు సంబంధించి విచారిస్తుండగా.. రోజుకొక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే.. దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం అనేది సంచలనంగా మారింది. అయితే ఈ కేసు విషయంలో పలువురు సినీ ప్రముఖలతో పాటు నెటిజన్స్ కూడా దర్శన్ పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.

అలాగే ఈ కేసులో తప్పు చేసిన వారిపై శిక్షపడేలా చూడాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు దర్శన్ అభిమానులు ఆయన ఏ తప్పు చేయలేదని మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శన్ కోసం కర్ణాటకలో పెద్ద ఎత్తునే రాలీలు కూడా నిర్వహించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ అభిమానని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శన్ మీద ప్రేమతో ఓ అభిమాని ఏడాది వయసున్న చిన్నారిని ఏకంగా ఖైదీలా మార్చేశాడు. కాగా,ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ స్టార్ హీరో దర్శన్ ఈ కేసు విషయంలో విచారణ జరుగుతుండటంతో ఇంకా జైలులో ఉన్నాడు. అయితే మరో వైపు దర్శన్ అభిమానులు మాత్రం ఆయన జైలుకి వెళ్లినప్పటి నుంచి జైలు ముందు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దర్శన్ పై తమ ప్రేమను రకరకాలుగా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ అభిమాని డిఫరెంట్ గా విచిత్ర ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా దర్శన్ పై తనకున్న ప్రేమను చాటి చెప్పడం కోసం ఏకంగా తన ఏడదిన్నర కూమారిడికి ఖైదీ డ్రెస్ తొడిగించి ఫోటో షూట్ చేయించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పైగా ఆ ఫోటోస్ లో బ్రాండ్ ఆఫ్ శాండల్ హుడ్ డి బాస్ ఫ్యాన్స్ మైసూర్ అనే సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం జరిగింది. ఇక ఆ ఫోటోస్ లో ఆ పిల్లాడికి ఖైదీ వేషధారణలో ముస్తాబు చేసి, దర్శన్‌కు ఇచ్చిన అండర్ ట్రయల్ ఖైదీ నంబర్‌ 6106నే చిన్నారి డ్రెస్ పై కూడా వేయించారు. అలాగే పిల్లాడి పక్కన జై డి బాస్ ఖైదీ నంబర్ 6106 అంటూ అక్షరాలు కూడా ఏర్పాటుచేశారు. అయితే ఈ ఫోటోను చూసిన దర్శన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ, సామాన్య నెటిజన్స్ మాత్రం విమర్శలు వర్షం కురిపించారు. అంతేకాకుండా.. ఖైదీ వేషధారణలో చిన్నారి ఫొటో తీయడం దారుణమంటూ సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఫోటోను చూసి అభిమానం అనుకోవాలో పిచ్చి అనుకోవాలో అర్ధం కావడం లేదు అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. మరి, దర్శన్ పై ప్రేమతో అభిమాని తన కూమారిడికి ఖైదీగా ముస్తాబ్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Brand of sandalwood DBOSS FanS ( Mysore) (@brand_of_sandalwood)

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş