iDreamPost
android-app
ios-app

వీడియో: స్టార్ యాక్టర్ పై 20 మంది దాడి.. కన్నతల్లి ముందే రక్తం వచ్చేలా..

  • Published May 13, 2024 | 9:17 PM Updated Updated May 13, 2024 | 9:17 PM

స్టార్ హీరోపై దాడికి పాల్పడ్డారు దుండగులు. తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా కారును వెంబడించిన దుండగులు దాడి చేశారు. తల్లి ముందే రక్తం వచ్చేలా కొట్టారు. అసలు ఏం జరిగిందంటే?

స్టార్ హీరోపై దాడికి పాల్పడ్డారు దుండగులు. తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా కారును వెంబడించిన దుండగులు దాడి చేశారు. తల్లి ముందే రక్తం వచ్చేలా కొట్టారు. అసలు ఏం జరిగిందంటే?

  • Published May 13, 2024 | 9:17 PMUpdated May 13, 2024 | 9:17 PM
వీడియో: స్టార్ యాక్టర్ పై 20 మంది దాడి.. కన్నతల్లి ముందే రక్తం వచ్చేలా..

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. తమ అభిమాన హీరోను కలవాలని, ఆయనతో ఫొటో దిగాలని తెగ ఆరాటపడుతుంటారు అభిమానులు. నటులపై అభిమానం చూపడమే తప్పా ధ్వేశం చూపించరు. అలాంటిది ఓ హీరోకు చేదు అనుభవం ఎదురైంది. అయితే అది ఫ్యాన్స్ నుంచి కాదు. దుండగుల నుంచి. నిన్న మాతృధినోత్సవం సందర్భంగా తన తల్లితో గుడికి వెళ్లిన నటుడిపై 20 మంది గూండాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తల్లి ముందే రక్తం వచ్చేలా చితకబాదారు. ఈ ఘటనతో చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేగింది. ఆ నటుడు మరెవరో కాదు కన్నడ ఇండస్ట్రీకి చెందిన చేతన్ చంద్ర. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

కోలీవుడ్ స్టార్ట్ యాక్టర్ చేతన్ చంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మదర్స్ డే సందర్భంగా చేతన్ చంద్ర తన తల్లితో కలిసి గుడికి వెళ్లాలనుకున్నాడు. తల్లితో కలిసి కారులో బయలు దేరాడు. దర్శనం అనంతరం తిరుగుపయనమయ్యారు. ఈ సమయంలోనే కొంతమంది గూండాలు చేతన్ చంద్ర కారును వెంబడించారు. ఆ తర్వాత కారుపై దాడి చేసి, కారు అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం హీరో చేతన్ చంద్రపై దాడికి పాల్పడ్డారు. తల్లి ముందే రక్తం వచ్చేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు దుండగులు. దాడికి గురైన నటుడు చేతన్ చంద్ర ముఖంపై రక్త స్రావం అవుతుండగానే ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో దాడి గురించి వెల్లడించారు.

చేతన్ చంద్ర మాట్లాడుతూ.. నేను మాతృ దినోత్సవం సందర్భంగా మా అమ్మతో కలిసి టెంపుల్ కి వెళ్ళాను. దర్శనం తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారును వెంబడించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపాడు. ఇదేంటని ప్రశ్నించగా మరో ఇరవై మంది వచ్చి తనపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని చెప్పడు. పోలీసులు ఈ ఘటనపై చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇక చేతన్ పై జరిగిన దాడిని పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. ప్రస్తుతం చేతన్ చంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చేతన్‌ ‘సత్యం శివం సుందరం’ అనే సీరియల్‌లో నటించాడు. ‍’ప్రేమిజం’, ‘రాజధాని’, ‘జరాసంధ’, ‘కుంభ రాశి’, ప్లస్‌’, ‘బజార్‌’ ఇలా తదితర కన్నడ సినిమాల్లో నటించాడు. ప్రేమిజం సినిమాతో ఎక్కువ పాపులారిటీని పొందాడు చేతన్ చంద్ర.

 

View this post on Instagram

 

A post shared by Chetan Chanddrra (@chetan_chanddrra)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet