Nidhan
Bollywood: భారీ సినిమాలు తీస్తూ టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఒకప్పుడు ఊపు ఊపింది హిందీ చిత్ర పరిశ్రమ. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్.. బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అనే రేంజ్లో హవా నడిపించింది.
Bollywood: భారీ సినిమాలు తీస్తూ టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఒకప్పుడు ఊపు ఊపింది హిందీ చిత్ర పరిశ్రమ. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్.. బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అనే రేంజ్లో హవా నడిపించింది.
Nidhan
భారీగా సినిమాలు తీస్తూ టాప్ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఒకప్పుడు ఊపు ఊపింది హిందీ చిత్ర పరిశ్రమ. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్.. బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అనే రేంజ్లో హవా నడిపించింది. సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎందరో బడా స్టార్లు ఉన్నారు. వాళ్లకు హ్యూజ్ ఫ్యాన్‌బేస్ ఉంది. వాళ్ల సినిమాలకు కూడా కళ్లు చెదిరే రేంజ్లో కలెక్షన్స్ వచ్చినా.. గ్లోబల్ రేంజ్లో భారతీయ చిత్రాలు అంటే కేరాఫ్ అడ్రస్‌గా బాలీవుడ్‌నే చెప్పేవారు. అయితే ఏదీ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! కాలం గిర్రున తిరిగింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ‘బాహుబలి’తో ఇండియన్ సినిమాకు నిర్వచనం మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆ మూవీ సాధించిన చారిత్రాత్మక విజయంతో అందరూ సౌత్ వైపు చూడసాగారు.
‘బాహుబలి 2’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’, ‘కాంతార’, ‘ఆర్ఆర్ఆర్’.. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ ఇలా వరుసగా సౌత్ మూవీస్ పాన్ ఇండియా హిట్లుగా నిలిచాయి. నార్త్ మార్కెట్లో ఇక్కడి చిత్రాలు వందల కోట్లు కొల్లగొట్టడం, నేషనల్ వైడ్‌తో పాటు ఇంటర్నేషనల్ అవార్డుల పరంగానూ సౌత్ సినిమాలదే ఆధిపత్యం నడుస్తుండటంతో బాలీవుడ్ క్రేజ్ పడిపోయింది. టాలీవుడ్ నుంచి ఏ మూవీ వస్తోంది, కన్నడ వాళ్లు ఎలాంటి ఫిల్మ్స్ తీస్తున్నారు, కోలీవుడ్ లేటెస్ట్ మూవీస్ ఏంటి అంటూ నార్త్ ఆడియెన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా కొందరు హిందీ మేకర్స్ తాము తోపులమంటూ, తమ తర్వాతే ఎవరైనా అంటూ బిల్డప్ ఇస్తుంటారు. అలాంటి వాళ్లకు ప్రముఖ తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చురకలు అంటించాడు. బాలీవుడ్ ఇంకో 20 ఏళ్లయినా సౌత్ వాళ్లలా సినిమాలు తీయలేదంటూ గాలి తీసేశాడు.
‘కమర్షియల్ మూవీస్ తీయాలంటే సౌత్ వాళ్లే. అది బాలీవుడ్‌కు చేతకాదు. మాస్, యాక్షన్ పల్స్ అనేది తెలుగు, తమిళం, కన్నడ దర్శకులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇంకో 15 నుంచి 20 ఏళ్లయినా హిందీ మేకర్స్ ఇలాంటి మూవీస్ తీయలేరు. యాక్షన్ సినిమాల్లో మన వాళ్లు ఎమోషన్‌ను బాగా పండిస్తారు. అలాగే హీరో ఎలివేషన్స్ కూడా అద్భుతంగా చూపిస్తారు. ఇది హిందీ దర్శకులకు ఎప్పటికీ అంతుపట్టని విషయం. దీన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్లకు కనీసం 5 ఏళ్లు పడుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకో 15 ఏళ్లు కావాలి. అప్పటికి సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్‌ను రూల్ చేస్తూ ఉంటారు’ అని జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ సౌత్ నుంచి భారీ పాన్ ఇండియా ఫిల్మ్స్ రాబోతున్నాయని.. వాటికి ‘కల్కి’ లైన్ క్లియర్ చేసిందన్నాడు. నార్త్ మార్కెట్లో ఆ ఫిల్మ్ భారీగా వసూళ్లు రాబట్టడంతో ‘కంగువా’తో పాటు ఇతర దక్షిణాది సినిమాలకు అక్కడ ఢోకా ఉండదనే భరోసా వచ్చిందన్నాడు. సూర్య ‘కంగువా’ను జ్ఞానవేల్ రాజానే నిర్మిస్తున్నాడు. మరి.. సౌత్‌లా బాలీవుడ్ మూవీస్ తీయలేదంటూ జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.