Kangana Ranaut: రూ.40 కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మకానికి పెట్టిన స్టార్ హీరోయిన్!

రూ.40 కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మకానికి పెట్టిన స్టార్ హీరోయిన్!

Kangana Ranaut: నేటికాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఆస్తులను కూడబెట్టుకోవడం చూస్తుంటాము. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రూ. 40 కోట్ల విలువ చేసే తన ఆస్తిని అమ్మేందుకు సిద్ధమైంది.

Kangana Ranaut: నేటికాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఆస్తులను కూడబెట్టుకోవడం చూస్తుంటాము. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రూ. 40 కోట్ల విలువ చేసే తన ఆస్తిని అమ్మేందుకు సిద్ధమైంది.

సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుంటారు. ఈ క్రమంలోనే భారీగానే ఆస్తులను సంపాదింకుంటారు. ఇంకొందరు సెలబ్రిటీలు భూములు, స్థలాలు వంటివాటిపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆస్తులను కూడబెట్టుకోవడం చూస్తుంటాము. ఇలాంటి సమయంలో ఓ స్టార్ హీరోయిన్..రూ. 40 కోట్ల విలువ చేసే తన ఆస్తిని అమ్మేందుకు సిద్ధమైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి ఆమె అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరి.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరు, ఆస్తులు అమ్మడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం….

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. అంతేకాక పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినీ ఇండస్ట్రీలోనే ఉంటూ..ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నుంచి ఆమె లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. పార్లమెంట్ లో తనదైన శైలీలో ప్రసంగిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ముంబైలో ఉన్న కోట్ల విలువ చేసే తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అందుకే కంగనా నిర్మాణ సంస్థ అయిన మణికర్ణిక ఫిల్మ్స్ ఆఫీస్ కూడా ఆ భవనంలోనే ఉంది. ముంబైలోని బాంద్రాలో దాదాపు 3,042 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తులో  ఈ భవనం ఉంది. అలాంటి ఈ ఇంటిని విక్రయించేందుకు కంగనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఇంటి ధరను రూ. 40 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం.

ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు కంగనా అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఇలాంటే 2020 సెప్టెంబర్ లో ముంబయి మున్సిపాలిటి అధికారులు ఆమె భవనాన్ని కూల్చి వేతకు సిద్ధణైన సంగతి తెలిసింది. ఆ తరువాత కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ఇష్యూపై కోర్టు స్టే విధించింది. అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కావాలనే తనను టార్గెట్ చేశాడని కంగనా ఆరోపించింది.  చివరకు 2023 మేలో కంగనాపై చేసిన అభియోగాలను బీఎంసీ ఉపసంహరించుకుంది. ఇక మొత్తానికి ఇంటి అమ్మకంపై వస్తున్న వార్తల విషయంలో కంగనా స్పందించలేదు. మరి.. వైరల్ అవుతున్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments