Swetha
కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాపై నిన్నమొన్నటి వరకు అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తమిళ్ లో పర్లేదు కానీ తెలుగులో మాత్రం అంతగా ఎవరు ఆసక్తి కనపరచలేదు అని అనిపిస్తుంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఒపీనియన్ అంతా మారిపోయింది.
కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాపై నిన్నమొన్నటి వరకు అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తమిళ్ లో పర్లేదు కానీ తెలుగులో మాత్రం అంతగా ఎవరు ఆసక్తి కనపరచలేదు అని అనిపిస్తుంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఒపీనియన్ అంతా మారిపోయింది.
Swetha
కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో మరో చక్కని మూవీ తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే అందరికి ఓ ఐడియా ఉంటుంది. కానీ ఈ థగ్ లైఫ్ సినిమా విషయంలో మాత్రం ఎవరికీ అంతగా ఆసక్తి చూపించలేదేమో అనిపించింది. సరిగా ప్రమోషన్స్ లేకపోవడం సినిమా నుంచి సరైన అప్డేట్స్ లేకపోవడంతో.. ఓ దశలో ఈ సినిమాను అంతా లైట్ తీసుకున్నారు. తమిళంలో పరవాలేదు కానీ తెలుగులో అయితే ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు చాలా తక్కువ. కానీ ఇదంతా నిన్న మొన్నటివరకు మాత్రమే. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలేహ్ రిలీజ్ అయిన ట్రైలర్ తో థగ్ లైఫ్ మీద ఒపీనియన్ అంతా మారిపోయిందని చెప్పి తీరాల్సిందే.
అసలు ఇప్పటివరకు సినిమా దేని గురించి.. ఎలాంటి ప్లాట్ ఉంటుంది.. కమల్ ఈసారి ఎలాంటి క్యారక్టరైజెషన్ లో కనిపిస్తాడు అని ఇలాంటివాటి మీద అందరికి సందేహాలు ఉండేవి. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అనుమానాలు అన్ని పటాపంచలయ్యాయి. ముఖ్యంగా కమల్ హాసన్ శింబు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని.. మొత్తం సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. వీరిద్దరూ కాకుండా జోజు జార్జ్, నాజర్ లాంటి నటీ నటులు కూడా ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. గ్యాంగ్ స్టర్ డ్రామాలు అన్నీ ప్రేక్షకులు బానే అలవాటు ఉన్నవే అయినా మణి సర్ మాత్రం తన స్టైల్ లో ప్రేక్షకులకు ఈ ప్లాట్ ను పరిచయం చేస్తారేమో అనిపిస్తుంది. ట్రైలర్ లో చూపించిన ప్రతిదీ ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలను పెంచేసింది.
ముఖ్యంగా కమల్ హాసన్ త్రిష మధ్యలో రొమాన్స్ అందరిని ఆశ్చర్యపరిచిందని చెప్పి తీరాల్సిందే. సోషల్ మీడియాలో ఈ షాట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల నుంచి మణిరత్నం తీసే సినిమాలలో తన మార్క్ కనిపించడం లేదని అంతా అంటూనే ఉన్నారు. కానీ ఈ సినిమాతో ఆ టాక్ తుడిచిపెట్టుకుపోయేలా ఉందని చెప్పొచ్చు. అసలే ఈ సమ్మర్ లో సరైన సినిమాలు సరిగ్గా లేవు. సో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ , కలెక్షన్స్ దక్కే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికైతే సినిమా మీద బాగానే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.