iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ నీల్ మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్! NTR31లో మరో స్టార్ హీరో!

  • Author Soma Sekhar Published - 05:46 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 05:46 PM, Mon - 17 July 23
ప్రశాంత్ నీల్ మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్! NTR31లో మరో స్టార్ హీరో!

ప్రశాంత్ నీల్.. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడీ పేరు ఓ ప్రభంజనం. ఒక్కో మూవీతో తనపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడీ డైరెక్టర్. తన టేకింగ్ తో.. మేకింగ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను, ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 31 సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ భారీ కాంబినేషన్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం కొరకు ప్రశాంత్ నీల్ మరో మాస్టర్ ప్లాన్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పాటుగా ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ హీరోను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ తో స్క్రీన్ పంచుకునే ఆ పాన్ ఇండియా హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తికాగానే లేదా.. చివరి దశకు రాగానే ఎన్టీఆర్ తో చిత్రాన్ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్ వేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ తో తీసే మూవీలో పాన్ ఇండియా స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ ను బరిలోకి దింపుతున్నాడట. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడట కమల్ హాసన్.

కాగా.. విక్రమ్ సినిమా సక్సెస్ తరువాత తన పంథాను మార్చారు కమల్. విభిన్నమైన సినిమాలకు కమిట్ అవుతూ.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీ అయిన ప్రాజెక్ట్ కె చిత్రంలో కమల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్-కమల్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. అది కూడా హీరో, విలన్ అయితే.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావడం పక్కా. ప్రశాంత్ నీల్ టేకింగ్ కు ఎన్టీఆర్-కమల్ యాక్షన్ తోడైతే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ వార్త తమిళ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి కమల్ హాసన్-ఎన్టీఆర్ కలిసి నటిస్తే.. ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఈ పిల్లాడిని గుర్తించారా? విలన్ గా ఇతనికి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş